For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Indian Cricketers Educational Qualifications: హార్దిక్, బుమ్రా స్కూల్ వరకే.. రోహిత్, కోహ్లీ ఇంటర్!

Indian Cricketers Educational Qualifications: Check Out Virat Kohli Rohit sharma MS Dhoni Details

హైదరాబాద్: క్రీడలు, చదువులు ఈ రెండింటినీ ఓకే సమయంలో మెయిన్‌టైన్ చేయడం చాలా కష్టం. సరిగ్గా చెప్పాలంటే.. కత్తి మీద సాము లాంటిదే. ఈ రెండింటిలో ఒకటి కావాలంటే.. మరో ఒక దాన్ని త్యాగం చేయాల్సిందే. ఇది కష్టంగా ఉన్నా మరోదారి ఉండదు. అలా తమ ఇష్టమైన ఆట కోసం చదువులను మధ్యలోనే అపేసి ఇప్పుడు కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు ప్రేరణగా మారారు. అయితే కొంతమంది క్రీడలు, చదువులను బ్యాలెన్స్ చేసుకుంటూ అత్యున్నతమైన చదువులు చదివారు. చాలా మందికి టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఏం చదువుకున్నారనే విషయం పెద్దగా తెలియదు. ఆ వివరాలు ఓసారి చూద్దాం.


India vs Sri Lanka: తొలి భారత బ్యాట్స్‌మన్‌గా పృథ్వీ షా అరుదైన రికార్డు! సెహ్వాగ్‌కే సాధ్యం కాలేదు!


హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ ద్రవిడ్‌దే:

హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ ద్రవిడ్‌దే:

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 16 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. దీంతో 12వ తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగాడు. టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఎంబీఏ చేశాడు. భారత క్రికెట్ చరిత్రలోనే హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ద్రవిడే. బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలీజిలో పీజీ పూర్తి చేశాడు. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. మాజీ పేసర్ జహీర్ ఖాన్ 12వ తరగితి వరకే చదవగా.. లక్ష్మణ్ ఎంబీబీఎస్‌ను మధ్యలోనే వదిలేశాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ డిగ్రీ పూర్తి చేశారు.

మహీకి డిగ్రీ పట్టా:

మహీకి డిగ్రీ పట్టా:

మాజీ ఆల్‌రౌండర్ యువ రాజ్ సింగ్ కూడా 12వ తరగతి వరకే చదువుకున్నాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ డిగ్రీ పూర్తిచేశాడు. వరల్డ్ క్రికెట్‌లో బెస్ట్ కెప్టెన్, వికెట్ కీపర్, ఫినిషర్‌గా గుర్తింపు పొందిన ధోనీ.. బీకామ్ డిగ్రీ పట్టా పొందాడు. మహీ అరంగేట్రం ఆలస్యం కావడంతో.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగలడు. ఇక స్పోర్ట్స్ కోటాలో రైల్వే కలెక్టర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేసిన ధోనీ.. ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. ఆపై ఉద్యోగాన్ని వదిలి ఆటపై పూర్తి దృష్టి పెట్టాడు. లోకేష్ రాహుల్ డిగ్రీ పూర్తిచేశాడు.

కోహ్లీ, రోహిత్ 12వరకే:

కోహ్లీ, రోహిత్ 12వరకే:

కెప్టెన్ విరాట్ కోహ్లీ 12 వ తరగతి వరకు చదువుకున్నాడు. 2008 లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఢిల్లీలోని విశాల్ భారతి పబ్లిక్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను అభ్యసించాడు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కూడా 12వ వరకు చదివాడు. రోహిత్ స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ పాఠశాల విద్యను పూర్తి చేయగా.. రిజ్వి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కళశాలలో చదుకున్నారు. 2007 లో భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. హిట్‌మ్యాన్ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆడాడు. శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ కూడా ఇంటర్ వరకే చదివారు.

అశ్విన్ వేరే లెవెల్:

అశ్విన్ వేరే లెవెల్:

భారత టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె డిగ్రీ పట్టా అందుకున్నాడు. ఎస్వీ జోషి హై స్కూల్ పాఠశాల.. రిజ్వి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ లో చదువుకున్నాడు. రహానే 2011లో భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. భారత్‌లో అత్యంత విజయవంతమైన స్పిన్నర్లలో ఒకరైన ఆర్ అశ్విన్ ఉన్నత చదువులు చదివాడు. చెన్నైలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బిటెక్ డిగ్రీ పొందాడు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా స్కూల్ వరకే చదివారు. ఇక నయా వాల్ ఛతేశ్వర్ పుజారా కరస్పాండెన్స్ ద్వారా బీబీఏ పూర్తిచేశాడు.

Story first published: Tuesday, July 20, 2021, 10:35 [IST]
Other articles published on Jul 20, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+