For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ పరుగులు చేయకున్నా పైసలకు లోటు లేదు.. ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కు రూ.8.69 కోట్లు!

Indian Cricketer Virat Kohli Earns 8.69 Crores For Per Instagram post

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేకున్నా.. పరుగులు చేయకున్నా అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ 100 మిలియన్ల ఫాలోవర్లను కలిగిన ఏకైక క్రికెటర్‌గా, ఆసియా వ్యక్తిగా రికార్డు నమోదు చేసిన కోహ్లీ తాజాగా మరో ఘనతను అందుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అత్యధిక డబ్బులు ఆర్జిస్తున్న క్రికెటర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఓ వెబ్‌సైట్ లెక్కల ప్రకారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కోహ్లీ ఒక్క వాణిజ్య పోస్ట్ షేర్ చేసినందుకు రూ.8.69 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్న ఏకైక ఆసియా వ్యక్తి కూడా కోహ్లీనే. ప్రపంచవ్యాప్తంగా మూడో ప్లేయర్.

సూపర్ బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన కోహ్లీ.. గత కొన్ని రోజులుగా పేలవ ఫామ్‌తో అపసోపాలు పడుతున్నాడు. గత మూడేళ్లుగా సెంచరీ చేయని కోహ్లీ.. పేలవ ఫామ్‌తో కెప్టెన్సీ కోల్పోయాడు. సారథ్యం కోల్పోయిన తర్వాతనైనా కోహ్లీ ఫామ్‌లోకి వస్తాడని అంతా భావించారు. కానీ కోహ్లీ ఆట మాత్రం రోజు రోజుకి దిగజారుతుందే తప్పా మెరుగవ్వడం లేదు. అయినా అతని క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రేజ్‌నే కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఇక కోహ్లీ ఒక్క పోస్ట్‌కు రూ.8.69 కోట్లు ఆర్జించడంపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

కోహ్లీ ఓ 20 పోస్ట్‌లతో శ్రీలంక దరిద్రాన్ని తరిమేయగలడని సెటైర్లు పేల్చుతున్నారు. ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకను కోహ్లీ ఆదుకోగలడని కామెంట్ చేస్తున్నారు. దేశంలోని పేదరికాన్ని కూడా కోహ్లీ నిర్మూలించగలడని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ డబ్బులతో కోహ్లీ సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు.

పేలవ ఫామ్ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం జింబాబ్వే పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. కోహ్లీని ఫామ్‌లోకి తీసుకొచ్చేందుకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. జింబాబ్వే పర్యటనలో విరాట్‌ను ఆడిస్తే అతను గాడిన పడుతాడని సెలెక్టర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ తీసుకున్న బ్రేక్‌‌తో అతనికి మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆశిస్తున్నా. మళ్లీ ఫామ్‌లోకి రావడానికి ఈ బ్రేక్ ఉపయోగపడుతుందనుకుంటున్నా. అయితే ఎలాంటి కాంపిటేటివ్ క్రికెట్ ఆడకుండా పెద్ద టోర్నీలు ఆడటం కష్టం అవుతుంది. అందుకే మేం అతన్ని జింబాబ్వే పర్యటనకు పంపించాలనుకుంటున్నాం.

అది అతనికి అనుగైన ఫార్మాట్. ఆసియా కప్ ముందు మళ్లీ ఫామ్ అందుకనేందుకు కోహ్లీకి జింబాబ్వే పర్యటన ఉపయోగపడుతుంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం.'అని సదరు సెలెక్షన్ కమిటీ మెంబర్ తెలిపాడు.

Story first published: Friday, July 22, 2022, 13:42 [IST]
Other articles published on Jul 22, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+