Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాన్నమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి!(వీడియో)

టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి తన నానమ్మకు బంగారు గాజులు గిఫ్ట్‌గా ఇచ్చాడు. నాలుగేళ్ల తర్వాత గురువారం తన సొంతూరైన గాజువాక వెళ్లిన నితీష్ రెడ్డి.. తన నానమ్మకు స్వయంగా బంగారు గాజులు తొడిగి ప్రేమాభిమానాలను చాటుకున్నాడు. ఈ సందర్భంగా ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నాడు. నితీష్ రెడ్డి రాకతో ఆ ఊర్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నితీష్ రెడ్డి.. భారత్‌కు ఆడాలని తన నానమ్మ కలలు కనేదని చెప్పాడు.

గట్ల ఉంటది అమ్మతోటి! ప్రెస్ కాన్ఫరెన్స్ ఆపేసిన నితీష్ రెడ్డి! (వీడియో)

గట్ల ఉంటది అమ్మతోటి! ప్రెస్ కాన్ఫరెన్స్ ఆపేసిన నితీష్ రెడ్డి! (వీడియో)

'సొంతూరికి వచ్చి చాలా రోజులైంది. స్వగ్రామానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడే నా బాల్యం గడిచింది. చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నేను ఈ స్థాయికి చేరుకోవడంలో నా తల్లిదండ్రుల పాత్ర ఎంతో గొప్పది. చిన్నప్పటి నుంచి నా కలలను నమ్మి, నన్ను అన్ని విధాలుగా ప్రోత్సహించారు. వారి త్యాగాలు, కష్టాల ఫలితంగానే నాకు భారత జట్టు తరఫున ఆడే అవకాశం దక్కింది.

Indian Cricketer Nitish Kumar Reddy Visits His Hometown Gajuwaka Gifts Golden Bangles to His Grandmother

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ నాకు ఆదర్శం. అతని ఆటతీరు, అంకితభావం, ఫిట్‌నెస్ నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. విరాట్ కోహ్లీని స్ఫూర్తిగా తీసుకొని క్రికెట్‌లో ముందకు సాగాను. భారత జట్టులో నా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. దేశం కోసం ఇంకా ఎన్నో సేవలు అందించాల్సి ఉంది. జట్టులో స్టిరమైన స్థానం సంపాదించి భారత క్రికెట్‌కు మరిన్ని విజయాలు అందించడమే నా లక్ష్యం. గాయం నుంచి కోలుకోవడానికి 4-5 వారాల సమయం పడుతుంది. ఆ తర్వాత మొదలయ్యే జింబాబ్వే సిరీస్‌తో నేను రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.'అని నితీష్ రెడ్డి చెప్పుకొచ్చాడు.

అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో నితీష్ రెడ్డి తొడ కండరాల గాయానికి గురైన సంగతి తెలిసిందే. ఈ గాయం నుంచి కోలుకోవడానికి 4-5 వారాల సమయం పడుతుందని వైద్యులు సూచించడంతో చివరి నిమిషంలో నితీష్ రెడ్డి ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో సూర్యాన్ష్ షెడ్జేను బీసీసీఐ ఎంపిక చేసింది.

నితీష్ రెడ్డికి ఎలాంటి అమ్మాయిలు ఇష్టమో తెలుసా.. లేడీస్ గెట్ రెడీ..!!

నితీష్ రెడ్డికి ఎలాంటి అమ్మాయిలు ఇష్టమో తెలుసా.. లేడీస్ గెట్ రెడీ..!!

ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తుండటంతో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగుతుండగా.. ఈ సిరీస్‌తోనే 2028 టీ20 ప్రపంచకప్ రోడ్ మ్యాప్ మొదలవ్వనుంది.

Story first published: Thursday, June 25, 2026, 17:20 [IST]
Other articles published on Jun 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+