For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో అమ్మాయితో హార్దిక్‌ పాండ్యా డేటింగ్‌.. ఆమె ఎవరో తెలుసా?

Hardik Pandya Dating With Nach Baliye Contestant Natasa Stankovic || Oneindia Telugu
Indian Cricketer Hardik Pandya Dating Nach Baliye Contestant Natasa Stankovic?

ముంబై: విండీస్ పర్యటన నుండి విరామం తీసుకున్న భారత స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మరో అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. ఈ మధ్య జరిగిన ఓ వేడుకలో ఆమెను తన కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఎవరు ఆమె అని అనుకుంటున్నారా?. విషయంలోకి వెళితే.

నటాషాతో ప్రేమలో:

నటాషాతో ప్రేమలో:

హార్దిక్‌ పాండ్యా బాలీవుడ్‌ బామలు ఊర్వశి రౌటేలా, ఎల్లీ అవ్రమ్‌, ఇషా గుప్తాతో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పాండ్యా 'నాచ్‌ బేలియె 9' అనే డ్యాన్స్‌ షో పోటీదారు నటాషా స్టాన్‌కోవిచ్‌తో ప్రేమలో పడినట్టు వార్తలు వస్తున్నాయి. బాద్షా హిట్‌సాంగ్‌ 'డీజేవాలె బాబు'తో నటాషా గుర్తింపు పొందింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో గెస్టు డ్యాన్సర్‌గా చేసింది.

సభ్యలుకు పరిచయం:

సభ్యలుకు పరిచయం:

తాజాగా ముంబైలోనికి బాంద్రాలో జరిగిన ఓ వేడుకకు నటాషాతో కలిసి హార్దిక్‌ పాండ్యా హాజరయ్యాడట. ఆ వేడుకలోనే హార్దిక్‌ తన కుటుంబ సభ్యలుకు ఆమెను పరిచయం చేశాడని తెలుస్తోంది. నటాషా స్టాన్‌కోవిచ్‌ 1989 మర్చి 4న సెర్బియాలో జన్మించింది. నటాషా బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌లోనూ పాల్గొంది. ప్రస్తుతం ఆమె పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తోంది.

 ఫ్యాషన్‌ వీక్‌లో సందడి:

ఫ్యాషన్‌ వీక్‌లో సందడి:

ఇటీవలే హార్దిక్‌ పాండ్యా లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో సందడి చేసాడు. ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంప్‌ వాక్‌ చేసిన హార్దిక్ అందరిని అలరించాడు. వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా జరిగిన టీ20 సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా కూడా ఈ కార్యక్రమంలో ర్యాంప్‌ వాక్‌ చేసాడు. హార్దిక్ పాండ్యా డిజైనర్ అమిత్ అగర్వాల్ కోసం ర్యాంప్‌లో పాల్గొన్నాడు.

ప్రపంజన్‌ మాయ.. తలైవాస్‌పై బెంగాల్ విజయం

మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు:

మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు:

ప్రపంచకప్‌కు ముందు కరణ్ జోహార్ నిర్వహించిన 'కాఫీ విత్ కరణ్' షోలో హార్దిక్‌ పాండ్యా పాల్గొని మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కొన్నాళ్లు అతడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. అయితే బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో బీసీసీఐ వదిలేసింది. అనంతరం హార్దిక్ బహిరంగంగా తక్కువ ప్రొఫైల్‌ను మైంటైన్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం అతడు నటాషాతో కలిసి తిరగడం గమనార్హం. ప్రపంచకప్‌ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న హార్దిక్‌ సొంతగడ్డపై త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు.

Story first published: Friday, August 30, 2019, 10:39 [IST]
Other articles published on Aug 30, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+