న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంజన్‌ మాయ.. తలైవాస్‌పై బెంగాల్ విజయం

Pro Kabaddi 2019 : Bengal Warriors Defeats Tamil Thalaivas To Go Second || Oneindia Telugu
PKL 2019: Prapanjan Super 10, Rinku’s High 5 give Bengal Warriors victory over Tamil Thalaivas

ఢిల్లీ: ప్రొకబడ్డీ లీగ్‌ సీజన్‌-7లో బెంగాల్‌ వారియర్స్‌ జట్టు గెలుపుబాట పట్టింది. గురువారం ఢిల్లీలోని త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ 35-26తో తమిళ్‌ తలైవాస్‌పై సునాయాస విజయంను అందుకుంది. రైడింగ్‌లో వారియర్స్‌ ఆటగాళ్లు ప్రపంజన్‌ (10పాయింట్లు), మహీందర్‌ సింగ్‌ (9పాయింట్లు) సత్తా చాటగా.. రింకు నర్వాల్‌ (5పాయింట్లు) ట్యాక్లింగ్‌లో రాణించాడు.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌: ధోనీకి దక్కని చోటు.. భువీకి విశ్రాంతి.. పాండ్యా పునరాగమనందక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌: ధోనీకి దక్కని చోటు.. భువీకి విశ్రాంతి.. పాండ్యా పునరాగమనం

వరుస రైడ్ పాయింట్లతో తలైవాస్‌ కెప్టెన్ అజయ్‌ ఠాకూర్‌ మంచి ఆరంభం ఇచ్చాడు. మ్యాచ్‌ 5-5 స్కోరుతో నువ్వానేనా అన్నట్టుగా సాగుతున్న సమయంలో ప్రపంజన్‌ మాయ మొదలైంది. ప్రపంజన్‌ దాటికి తలైవాస్‌ జట్టు అనుభవజ్ఞులు మంజీత్ చిల్లార్, షబీర్ బాపు కోర్టు బయటే ఉన్నారు. ప్రపంజన్‌ మరింత దూకుడు పెంచడంతో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసిన బెంగాల్ 11-7తో ఆధిక్యం సంపాదించింది. ఈ సమయంలో రాహుల్ చౌదరి, అజయ్‌ ఠాకూర్‌, మంజీత్ చిల్లార్ ఫామ్ అందుకోవడంతో 14-15తో తలైవాస్‌ తొలి అర్ధ భాగాన్ని ముగించింది.

రెండో అర్ధ భాగంలో ప్రపంజన్‌ వరుస పాయింట్లు సాధించడంతో బెంగాల్‌ ఆధిక్యం దిశగా దూసుకెళ్లింది. అయితే ఆనంద్ తమిళ తలైవాస్‌ను తిరిగి ఆటలోకి తీసుకురావడానికి సూపర్ రైడ్‌తో గట్టిగా పోరాడాడు. మరోవైపు అజయ్‌ ఠాకూర్‌ కూడా సూపర్-10 సాధించినా.. ప్రపంజన్‌ కూడా రెచ్చిపోవడంతో బెంగాల్‌ ఆధిక్యంను కొనసాగించింది. బెంగాల్ అదే ఊపులో మ్యాచ్ గెలిచింది. అజయ్‌ ఠాకూర్‌ (11) పోరాడినా తలైవాస్‌ విజయాన్ని అందుకోలేకపోయింది. 11 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 39 పాయింట్లు సాధించిన బెంగాల్.. పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ రోజు టైటాన్స్‌ × పుణెరి, ఢిల్లీ × పట్నా జట్లు తలపడనున్నాయి.

Story first published: Friday, August 30, 2019, 9:47 [IST]
Other articles published on Aug 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X