న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సౌతాఫ్రికా‌తో వన్డే సిరీస్ .. నెట్స్‌లో చెమటోడ్చిన భారత క్రికెటర్లు

Indian cricket team trains in Dharamsala Over three-match ODI series against South Africa

ధర్మశాల: న్యూజిలాండ్ గడ్డపై దారుణంగా విఫలమైన కోహ్లీసేన స్వదేశంలో మరో సవాల్‌కు సిద్ధమైంది. గురువారం నుంచి సౌతాఫ్రికాతో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సిరీస్ తొలి వన్డే హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా జరగనుండగా.. ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత ఆటగాళ్లు మంగళవారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాడు.

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సహా జట్టు ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. 15న లక్నోలో రెండో వన్డే, మూడో వన్డే 18న కోల్‌కతాలో జరగనుంది. ఈ మూడు మ్యాచ్‌లు డే-నైట్‌ మ్యాచ్‌లే కావడం విశేషం. ఇటీవల న్యూజిలాండ్‌లో పర్యటించిన టీమిండియా టీ-20 సిరీస్‌ను 5-0తో వైట్‌వాష్‌ చేసి, వన్డే సిరీస్‌ను 0-3, టెస్టు సిరీస్‌ను 0-2తో క్లీన్ స్వీప్ గురైంది. దీంతో, సౌతాఫ్రికాతో జరిగే ఈ వన్డే సిరీస్‌లో‌నైనా రాణించి, పూర్వపు ఫామ్‌ అందుకోవాలని కోహ్లీసేన తహతహలాడుతోంది.

ఈ సిరీస్‌ను కరోనా వైరస్ భయం వెంటాడుతోంది. దేశంలో దాని ప్రభావం అంతగా లేకున్నా జనాల్లో నెలకొన్న భయం మ్యాచ్ హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్యపై ప్రభావం చూపనుంది. ఇక ఆటగాళ్లు కూడా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రయాణాల్లో మాస్క్‌లు ధరిస్తున్నారు. బీసీసీఐ కూడా షేక్ హ్యాండ్స్, ఫ్యాన్స్ ఇంటరాక్షన్స్, సెల్ఫీలు ఇవ్వదని ఆటగాళ్లకు గైడ్ లైన్స్ జారీ చేసింది.

ఈ టోకెన్ గేమ్స్‌కు ఎవడన్నా వస్తాడా? బిజీ షెడ్యూల్‌పై క్లార్క్ ఫైర్! మండిపడ్డ బోల్ట్ఈ టోకెన్ గేమ్స్‌కు ఎవడన్నా వస్తాడా? బిజీ షెడ్యూల్‌పై క్లార్క్ ఫైర్! మండిపడ్డ బోల్ట్

గాయంతో జట్టుకు దూరమైన హార్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ ఈ సిరీస్‌తోనే రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వెన్ను సర్జరీ తర్వాత పాండ్యా తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఇటీవల దేశవాళీ టోర్నీలో విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టిన ఈ ఆల్‌రౌండర్.. సఫారీలపై ఏ మేరకు రాణిస్తాడోనని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక మంగళవారం పాండ్యా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. గుడ్ లెంగ్త్, షార్ట్ పిచ్, యార్కర్ బంతులను ప్రాక్టీస్ చేశాడు.

Story first published: Tuesday, March 10, 2020, 21:01 [IST]
Other articles published on Mar 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X