అతనికి రెస్టా? ఆ ముచ్చటే లేదు.. అశ్విన్ కాబట్టే ఆ బంతిని వదిలేసాడు: భారత బౌలింగ్ కోచ్

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా టీమిండియా ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరంగా ఉండనున్నాడనే వార్తలను బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఖండించాడు. అతను ఫిట్‌గా ఉన్నాడని, విశ్రాంతి ఇచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశాడు. పాకిస్థాన్‌పై సంచలన విజయంతో మెగాటోర్నీలో శుభారంభం చేసిన టీమిండియా.. నెదర్లాండ్స్‌తో తదుపరి పోరుకు సిద్దమైంది. గురువారం సిడ్నీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం అన్ని విధాలుగా సిద్దమవుతోంది. పాక్ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే అక్కడి చేరుకున్న భారత ఆటగాళ్లు ఆ రోజు విశ్రాంతి అనంతరం ప్రాక్టీస్ ప్రారంభించారు. మంగళవారం ఆప్షనల్ ప్రాక్టీస్ ఉన్నప్పటికీ బ్యాట్స్‌మెన్ నెట్స్‌లో శ్రమించారు. కోహ్లీ, రోహిత్, రాహుల్, కార్తీక్, పంత్, హుడా దాదాపు 2 గంటల సెషన్‌లో పాల్గొన్నారు.

హార్దిక్ సూపర్ ఫిట్..
ఈ ప్రాక్టీస్ సెషన్‌కు హార్దిక్ పాండ్యా దూరంగా ఉండటంతో అతనికి రెస్ట్ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. అంతేకాకుండా పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్ తిమ్మిర్లతో బాధపడ్డాడు. దాంతో అతను రెస్ట్ తీసుకోవడం ఖాయమని అంతా భావించారు. కానీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే మాత్రం ఈ వాదనను తోసిపుచ్చాడు. 'మేము ఎవరికీ విశ్రాంతి ఇవ్వడం లేదు. టోర్నమెంట్‌లో మరింత ముందుకు వెళ్లే అనుకూలత మాకుంది. విడిగా ఆటగాళ్లు అందరూ ఫామ్ లోకి రావాల్సి ఉంది. పాకిస్థాన్ పై కోహ్లీ అపురూప ఇన్నింగ్స్ విషయంలో పాండ్యాను సైతం అభినందిచాలి. కోహ్లీ బ్యాట్ తో రెచ్చిపోతుంటే, మరోవైపున్న పాండ్యా పూర్తి సహకారం అందించాడు. 'అని తెలిపాడు.

అశ్విన్ జీనియస్..
పాక్‌తో విజయంలో అశ్విన్‌ది కూడా కీలక పాత్రేనని పరాస్ మాంబ్రే అభిప్రాయపడ్డాడు. ఆ చివరి బంతిని అశ్విన్ కాబట్టే వదిలాడని, మరే బ్యాటర్ ఉన్నా ఆడేవాడని తెలిపాడు. అశ్విన్ సమయస్పూర్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని, విజయంలో అతనిది కీలక పాత్రని చెప్పుకొచ్చాడు. 'రవి అశ్విన్ సమయస్పూర్తితో ఆ బంతిని వదిలేసాడు. చాలా ప్రశాంతంగా ఆడాడు. మరే ఆటగాడైనా ఆ బంతిని ఆడేవారు. అశ్విన్ టాప్ ప్లేయర్ కాబట్టే సమయస్పూర్తితో ఆడి భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.'అని తెలిపాడు.

అర్ష్‌దీప్ అద్భుతం..
యువ బౌలర్ అర్ష దీప్ సింగ్‌పై కూడా పరాస్ మాంబ్రే ప్రశంసల జల్లు కురిపించాడు. మైదానంలో చాలా కూల్‌గా ఉంటాడని కొనియాడాడు. 'అతని ప్రశాంతత, ఆలోచన విధానంలోని స్పష్టతకు ఎవ్వరైనా కొనియాడాల్సిందే. కెరీర్‌లో హెచ్చు, తగ్గులు ఉంటాయని భావిస్తున్నాను. అయితే అతడు పునరాగమనం చేసిన విధానం, ఒత్తిడిని ఎదుర్కోగల సామర్థ్యం అసాధరణమనే చెప్పాలి. అతడిని చూసి నిజంగా ఆశ్చర్యపోనక్కర్లేదు. పాక్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడిపై మాకు పూర్తి నమ్మకమొచ్చింది. అతనికి మంచి భవిష్యత్తు ఉంది.'అని పరాస్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications