IND vs SL: శ్రీలంకతో టెస్ట్ సిరీస్.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..?
సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు సిద్దమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఆగస్ట్ 15 నుంచి ఈ రెండు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ గాలె వేదికగా ఆగస్ట్ 19 వరకు జరగనుండగా.. రెండో టెస్ట్ కొలంబో వేదికగా ఆగస్ట్ 23 నుంచి 27 వరకు జరగనుంది.
ఇప్పటికే ఈ రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. గాయాలతో వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా దూరం కాగా.. సాయి సుదర్శన్, జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..?
డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఈ రెండు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా గెలవడం చాలా కీలకం. ఎందుకంటే డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో భారత్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. డబ్ల్యూటీసీ 2025-27 ఎడిషన్‌లో ఇప్పటి వరకు భారత్ 9 మ్యాచ్‌ల్లో 4 గెలిచి, 4 ఓడి, ఒకటి డ్రా చేసుకొని 48.15 విన్నింగ్ పర్సంటేజీతో ఐదో స్థానంలో నిలిచింది.
8 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 87.50 విన్నింగ్ పర్సంటేజీతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా..4 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, 75 విన్నింగ్ పర్సంటేజీతో సౌతాఫ్రికా రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 72.22 విన్నింగ్ పర్సెంటేజీతో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 58.33 విజయాల శాతంతో బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది.
9 మ్యాచ్‌ల్లో భారత్ 7 గెలవాలి..
డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ ముగిసే సరికి టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ ఆడుతాయి. భారత్ ఫైనల్ చేరాలంటే టాప్-2లో నిలవాలి. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్.. ఇంకా 9 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. శ్రీలంకతో రెండు, న్యూజిలాండ్ రెండు ఆవే సిరీస్‌లు ఆడనున్న భారత్.. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.
ఈ 9 మ్యాచ్‌ల్లో భారత్ కనీసం 7 మ్యాచ్ గెలిస్తే డబ్ల్యూటీసీ టాప్-2 ప్లేస్ దక్కుతుంది. భారత్ ఆడే తదుపరి సిరీస్‌ల్లో శ్రీలంకనే సులువైన ప్రత్యర్థి. కాబట్టి ఈ రెండు టెస్ట్‌ల సిరీస్ గెలిస్తే భారత్ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ తర్వాత ఏడు మ్యాచ్‌ల్లో ఐదు గెలిస్తే సరిపోతుంది.
గంభీర్ పర్యవేక్షణలో పేలవ ప్రదర్శన..
అయితే గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్ట్‌ల్లో భారత్ ఘోర పరాజయాలను చవిచూస్తోంది. ఎన్నడూ లేని విధంగా సొంతగడ్డపై సిరీస్‌ల్లో క్లీన్ స్వీప్ అయ్యింది. డబ్ల్యూటీసీ భాగంగా గతేడాది నవంబర్‌లో సొంగడ్డపై జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ వైఫల్యాలకు భారత్ చెక్ పెడుతుందా? లేక కొనసాగిస్తుందా? అనేది చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

