India Womens T20 World Cup Squad: మన శ్రీచరణి, అరుంధతి రెడ్డికి చోటు
India Womens T20 World Cup Squad:ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను అమితా శర్మ నేతృత్వంలోని మహిళల సెలక్షన్ కమిటీ వెల్లడించింది. జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది.
శనివారం ముంబైలోని బీసీసీఐ హెడ్ ఆఫీస్‌లో సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా, హెడ్ కోచ్ అమోల్ మజుందార్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో ప్రత్యేకంగా సమావేశమైన సెలెక్షన్ కమిటీ.. అనంతరం టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. గాయం కారణంగా అమన్‌జ్యోత్ కౌర్ జట్టుకు దూరమైంది. ఆమె స్థానంలో భారతి పుల్మాలిని ఎంపిక చేశారు. బ్యాటర్ హర్లీన్ డియోల్‌తో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ స్నేహ్ రాణాలపై వేటు పడింది. పేలవ ఫామ్ నేపథ్యంలోనే వారిని పక్కనపెట్టారు.

తెలుగు తేజాలు శ్రీచరణితో పాటు అరుంధతి రెడ్డి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టును నడిపించనుండగా.. స్మృతి మంధాన ఆమెకు డిప్యూటీగా వ్యవహరించనుంది. షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, యాస్తికా భాటియా, నందిని శర్మ, రేణుకాసింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. టీ20 ప్రపంచకప్ ముందు ఇదే జట్టు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది.
భారత్ X పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
ఈ మెగా టోర్నీలో మొత్తం 12 జట్లు బరిలోకి దిగుతుండగా.. గ్రూప్-ఏలో ఉన్న భారత్ లీగ్ దశలో పాకిస్థాన్‌తో జూన్ 14న ఆడనుంది. 17న నెదర్లాండ్స్, 21న సౌతాఫ్రికా, 25న బంగ్లాదేశ్, 28న ఆస్ట్రేలియా టీమిండియా తలపడనుంది.
గ్రూప్-బీలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఉన్నాయి. జూన్ 30న తొలి సెమీస్, జులై 2న రెండో సెమీస్ జరగనుండగా.. జులై 5న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగియనుంది.
మహిళల టీ20 ప్రపంచకప్‌తో పాటు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కేప్టెన్), స్మృతి మంధానా, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, యాస్టికా భాటియా, నందిని శర్మ, క్రాంతి గౌడ్, రాధా యాదవ్, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, అరుంధతి రెడ్డి, అనుష్క శర్మ, దీప్తి శర్మ.
ఇంగ్లండ్‌తో లార్డ్స్ టెస్ట్ కోసం భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కేప్టెన్), స్మృతి మంధానా, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, ప్రతీక రావల్, శ్రీ చరణి, యాస్టికా భాటియా, నందిని శర్మ, హర్లీన్ డియోల్, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే, స్నేహ్ రాణా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications