Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India women vs England women: సమమా.. సమర్పణమా? ఒత్తిడిలో మిథాలీ సేన!

India Women vs England Women, 2nd ODI Preview: Pressure Awaits Mithali and co after Embarrassing Loss

టాంటన్: ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో భారత అమ్మాయిలు చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. బ్యాటింగ్‌లో మోస్తరుగా రాణించినా.. బౌలింగ్‌లో విఫలమై తొలి మ్యాచ్‌లో ఓడి ఒత్తిడిలో ఉన్న మిథాలీ సేన బుధవారం జరిగే రెండో వన్డేలో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 0-1తో వెనుకబడ్డ మిథాలీసేన.. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలి. అయితే గత మ్యాచ్‌లో స్టో బ్యాటింగ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లోనైనా దూకుడుగా ఆడుతుందోలేదో చూడాలి. గత మ్యాచ్‌లో 181 డాట్ బాల్స్ ఆడటం అమ్మాయిల నిర్లక్ష్యపు ఆటకు నిదర్శనం.

కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అద్భుత అర్ధ సెంచరీతో అదరగొట్టినా ఫలితం లేకపోయింది. బ్యాటింగ్‌లో మిథాలీకి తోడు పూనమ్‌ రౌత్‌, దీప్తి శర్మ మాత్రమే రాణించారు. టీనేజ్‌ సంచలనం షెఫాలీ వర్మ, స్మృతి మంథాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లాంటి స్టార్లు సత్తాచాటాల్సిన అవసరముంది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో మెరుగైన పెర్ఫామెన్స్ చూపాల్సి ఉంది.

ఈ మ్యాచ్‌ ఫైనల్ ఎలెవన్‌లో ఒకటి, రెండు మార్పులు చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. పూనమ్ రౌత్ ప్లేస్‌లో జెమీమా రొడ్రిగ్స్ రావొచ్చు. హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ, తానియా భాటియా భారీ స్కోర్లు చేయాల్సి ఉంది. బౌలింగ్‌లో జులన్ గోస్వామి స్ట్రయిక్ వికెట్లు తీయకపోవడం కూడా లోటుగా మారింది. హైదరాబాదీ అరుంధతి రెడ్డి, ఏక్తా బిష్త్ నుంచి సహకారం అందాల్సి ఉంది. మరోవైపు ఇంగ్లండ్ అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తోంది. ఇక.. సూపర్‌ ఫామ్‌లోనున్న బ్యూమాంట్‌, నాట్‌ షివర్‌లాంటి పటిష్ట బ్యాటింగ్‌ లైన్‌ప్ ఆ జట్టు సొంతం. భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఈ మ్యాచ్ సాయంత్ర 6.30 గంటలకు ప్రారంభం కానుండగా.. సోనీ టెన్-1లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Story first published: Wednesday, June 30, 2021, 9:57 [IST]
Other articles published on Jun 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+