For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ind vs Eng:వన్డే సమరానికి వేళాయే..టీమిండియా ఆశలన్నీ వారిపైనే!ఫామ్‌లో ఇంగ్లండ్‌! తుది జట్లు ఇవే!!

India Women vs England Women 1st ODI Preview, Dream11 Prediction and Playing XI

బ్రిస్టోల్‌: ఏడేళ్ల తర్వాత ఆడిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్‌తో పోరును డ్రాగా ముగించిన భారత మహిళల జట్టు.. ఇక అదే జట్టుతో వన్డే సమరానికి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం బ్రిస్టోల్‌లోని కౌంటీ మైదానంలో తొలి మ్యాచ్‌ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు టాస్ పడనుండగా.. 3.30కి మ్యాచ్ మొదలవనుంది. మొదటి వన్డేలో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని మిథాలీ సేన ఆశిస్తోంది. అయితే ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్‌ను నిలువరించడం మాత్రం అంత సులువుకాదు.

షెఫాలీ అరంగేట్రం

షెఫాలీ అరంగేట్రం

గతేడాది టీ20 ప్రపంచకప్‌లో సంచలన బ్యాటింగ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించి.. ఇటీవల తన తొలి టెస్టులోనూ ఇంగ్లండ్‌పై గొప్పగా రాణించిన 17 ఏళ్ల ఓపెనర్‌ షెఫాలీ వర్మ ఈ మ్యాచ్‌తో వన్డేల్లోనూ అరంగేట్రం చేయనుంది. హరియాణా టాపార్డర్‌ బ్యాటర్‌ ఇంగ్లండ్‌ గడ్డపైనే ఇటీవల ఏకైక టెస్టు ఆడింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధ సెంచరీ (96, 63)లతో అదరగొట్టిన షఫాలీ ఇప్పుడు వన్డే కెరీర్‌కు గొప్ప ప్రారంభం ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ.. అలవోకగా భారీ షాట్లు ఆడగలిగే ఈ టీనేజీ బ్యాటర్ జట్టుకు అదనపు బలాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. షఫాలీ రాకతో బ్యాటింగ్ ఆర్డర్లో కొత్త ఉత్సాహం రానుంది.

రాయ్‌తో ప్రయోగం చేస్తారా?

రాయ్‌తో ప్రయోగం చేస్తారా?

ఓపెనర్లుగా స్మృతి మంధాన, షఫాలీ శర్మ రానున్నారు. వన్‌ డౌన్‌లో పూనమ్‌ రౌత్‌, కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌తో పాటు ఆరో నంబర్‌లో ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ బరిలోకి దిగే చాన్సుంది. వికెట్‌ కీపర్‌గా కొత్తమ్మాయి ఇంద్రాణీ రాయ్‌తో ప్రయోగం చేస్తారా? లేదా టెస్టులో రాణించిన తానియా భాటియాకు అవకాశం కల్పిస్తారా? అనేది వేచి చూడాలి. పేసర్లలో సీనియర్ జులన్‌ గోస్వామికి చోటు ఖాయం. పూజ వస్రాకార్, అరుంధతి రెడ్డి, శిఖా పాండేలో ఇద్దరికి తుది జట్టులో అవకాశం దక్కొచ్చు. ఇక సిన్నర్లలో ఏక్తా బిస్త్‌ లేదా రాధా యాదవ్‌, స్నేహ్‌ రాణా మధ్య పోటీ నెలకొంది.

WTC Final:అతడి పేరుచూసి తీసుకోవడం కన్నా..ఇటీవలికాలంలో ఫామ్‌ చూడాల్సింది!భారత సెలెక్టర్లపై మాజీ క్రికెటర్‌ ఫైర్

పటిష్టంగా ఇంగ్లండ్

పటిష్టంగా ఇంగ్లండ్

సొంతగడ్డపై ఇంగ్లండ్‌ కఠినమైన ప్రత్యర్థి. కెప్టెన్‌ హీథర్‌ నైట్, బీమోంట్‌లతో పాటు బ్యాటింగ్‌ ఆల్‌ రౌండర్లు సీవర్, సోఫియా రాణిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. బ్యూమాంట్‌, నైట్‌, స్కివర్‌పైనే ఇంగ్లిష్‌ బ్యాటింగ్‌ ఎక్కువగా ఆధారపడింది. వీరిని నిలువరిస్తే సగం పనిఅయిపోయినట్టే. ఇక బౌలింగ్‌లో కేట్‌ క్రాస్, ఎకిల్‌స్టోన్, ష్రబ్‌సోల్‌లతో ఈ విభాగం కూడా పటిష్టంగా ఉంది. మ్యాచుకు వర్షం నుంచి ఎలాంటి ముప్పులేదు. ఛేజింగ్ చేసిన జట్టే ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ. 250-60 స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది.

రికార్డ్స్

రికార్డ్స్

చివరగా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ 1-4తో చిత్తయిన భారత్.. ఇప్పుడు ఇంగ్లండ్​పై మంచి ప్రదర్శనతో వచ్చే ఏడాది న్యూజిలాండ్లో జరిగే ప్రపంచకప్ దిశగా సన్నాహకాలను మెరుగ్గా ప్రారంభించాలని ఆశిస్తోంది. ఇంగ్లండ్‌తో ఇప్పటివరకు 71 మ్యాచ్‌ల్లో తలపడిన భారత్‌ 30 మ్యాచ్‌ల్లో గెలిచింది. 37 మ్యాచ్‌ల్లో ఓడింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.

తుది జట్లు

తుది జట్లు

భారత్: షఫాలి వర్మ, స్మృతి మంధనా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్, తానియా భాటియా, దీప్తి శర్మ, జులాన్ గోస్వామి, శిఖా పాండే, పూజా వస్త్రకర్, స్నేహ రానా.

ఇంగ్లాండ్: టామీ బ్యూమాంట్, లారెన్ విండ్‌ఫీల్డ్ హిల్, హీథర్ నైట్, నటాలీ స్కివర్, అమీ జోన్స్, ఫ్రాన్ విల్సన్, కేథరీన్ బ్రంట్, సారా గ్లెన్, సోఫీ ఎక్లెస్టోన్, తాష్ ఫార్రాంట్, అన్య ష్రబ్‌సోల్.

Story first published: Sunday, June 27, 2021, 10:26 [IST]
Other articles published on Jun 27, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+