
ఒక్క వికెట్ లేదు
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ బరిలోకి దిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేదు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 36.4 ఓవర్లు వేసి 92 రన్స్ ఇచ్చాడు. మెయిడిన్ ఓవర్లు కూడా ఎక్కువగా వేయలేకపోయారు. దీంతో భారత్ ఓటమికి పరోక్షంగా కారకుడయ్యాడు. మరోవైపు షమీ, అశ్విన్ నాలుగేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ మూడు, జడేజా ఒక వికెట్ తీశారు. అదే పిచ్‌పై కివీస్ బౌలర్లు కోహ్లీసేనను రెండుసార్లు ఆలౌట్ చేశారు. కైల్ జేమిన్సన్, టీమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ నిప్పులుచేరిగారు.

పేరు ప్రఖ్యాతులను చూసే
ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ టీమిండియా మాజీ క్రికెటర్ సబా కరీం మాట్లాడుతూ... 'జస్ప్రీత్ బుమ్రా విషయంలో బీసీసీఐ సెలెక్టర్లు సరైన దృష్టి పెట్టలేదని నాకు అనిపిస్తోంది. ఇటీవలి కాలంలో బుమ్రా ఫామ్ చూడకుండా.. కేవలం పేరు ప్రఖ్యాతులను చూసే తుది జట్టులోకి తీసుకొని ఉండొచ్చు. ఆస్ట్రేలియా పర్యటనలో అతడు గాయపడ్డాక మళ్లీ టెస్టు క్రికెట్ ఆడలేదు. ఇంగ్లండ్‌తోనూ టీ20 మ్యాచులే ఆడాడు. ఈ నేపథ్యంలోనే అతడు ఫామ్‌లో లేడని నాకు అనిపిస్తోంది' అని అన్నారు. కరీం భారత్ తరఫున 2000లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడారు. ఒక ఇన్నింగ్స్ ఆడి 15 పరుగులు చేశారు. ఇక 34 వన్డేల్లో 362 రన్స్ బాదారు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది.
Rajiv Gandhi Khel Ratna రేసులో స్టార్ హాకీ ప్లేయర్లు!!

అనుకూలమైన పరిస్థితులలో కూడా:
'డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా కొంతవరకు లయ అందుకున్నట్లు నాకు అనిపించింది. కొన్ని సందర్భాల్లో అతడిని దురదృష్టం కూడా వెంటాడింది. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో అనుకూలమైన పరిస్థితులలో బుమ్రా అవసరమైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేకపోయాడు. ఇది చాలా పెద్ద ఆందోళన కలిగించే అంశం.
రాబోయే సిరీస్‌లో దీనిని సరిదిద్దడం అవసరం' అని సబా కరీం చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియా పర్యటనలో బుమ్రా గాయపడ్డాక మళ్లీ టెస్టు క్రికెట్ ఆడలేదని కరీం పేర్కొనడం నిజం కాదు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో అతడు రెండు మ్యాచులు ఆడాడు. తొలి టెస్టులో నాలుగు వికెట్లు తీసిన బుమ్రా.. మూడో టెస్టులో ఒక్క వికెట్ కూడా తీయలేదు. స్పిన్ పిచ్ కావడంతో అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్ చెలరేగారు.

సరైన నిర్ణయం తీసుకోవాలి
ఆగస్టులో ఇంగ్లండ్‌తో ఆడే ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌పై దృష్టి సారించి, సరైన నిర్ణయం తీసుకోవాలని సబా కరీం పేర్కొన్నారు. ప్రస్తుతం బుమ్రా ఫామ్ ఆందోళనకరంగా ఉందన్నారు. ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత ఇంగ్లండ్‌లోనే ఉన్న భారత ఆటగాళ్లకు ఇప్పుడు 20 రోజుల పాటు విశ్రాంతి ఇచ్చారు. దాంతో వారంతా కుటుంబాలతో సహా బయటకు వెళ్లడానికి అనుమతులు లభించాయి. జులై 14న తిరిగి లండన్‌లో ఏకమై.. మళ్లీ క్వారంటైన్‌లోకి వెళ్లనున్నారు. ఆ తర్వాతే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టు రెండు బృందాలుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications












