క్రికెట్ పుట్టినింట్లో చరిత్ర సృష్టించిన భారత్.. ఇంగ్లండ్‌పై ఘన విజయం!
భారత మహిళల టెస్ట్ టీమ్ చరిత్ర సృష్టించింది. క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ మైదానంలో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో సమష్టిగా రాణించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళల జట్టు 270 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
నాలుగు రోజులే నిర్వహించిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. పటిష్టమైన ఇంగ్లండ్‌ను రెండు సార్లు ఆలౌట్ చేసి సరికొత్త చరిత్రను లిఖించింది. మహిళల క్రికెట్ చరిత్రలోనే లార్డ్స్ వేదికగా టెస్ట్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్‌లో భారత్ దుమ్మురేపింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణించి ఇంగ్లండ్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది.

కుప్పకూలిన ఇంగ్లండ్..
457 పరుగుల లక్ష్య ఛేదనలో 130/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే కుప్పకూలింది. అమీ జోన్స్(80 బంతుల్లో 6 ఫోర్లతో 54), సోఫీ ఎక్లీస్టోన్(66 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా(4/42) నాలుగు వికెట్లతో చెలరేగగా.. దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, సయాలి సత్ఘరే రెండేసి వికెట్లు పడగొట్టారు.
యస్తికా భాటియా సెంచరీ..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన(83), హర్మన్‌ప్రీత్ కౌర్(58), దీప్తి శర్మ(57) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం ఇంగ్లండ్ 170 పరుగులకే కుప్పకూలింది. క్రాంతి గౌడ్(5/37) ఐదు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించింది.
115 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 86.3 ఓవర్లలో 341/7 స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. యస్తికా భాటియా(113) రికార్డ్ సెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధాన(70), రిచా ఘోష్(50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. దాంతో ఇంగ్లండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

