Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా విశ్వవిజేతగా నిలిచేనా? ఆట పుట్టిన గడ్డపై ఆధిపత్యం చెలాయించేనా?

క్రికెట్ పుట్టింట్లో.. అద్భుతం చేయాలనే కసితో.. కప్పు కొట్టాలనే గురితో భారత మహిళల జట్టు బరిలోకి దిగుతోంది.! గతేడాది వన్డే వరల్డ్‌కప్‌తో మురిపించిన మన హర్మన్‌సేన.. ఇప్పుడు ఇంగ్లండ్‌ గడ్డపై తీరని కలగా మిగిలిన పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడేందుకు సిద్దమైంది.!

గత పరాజయాలను మరిచి.. ఈసారి ఎలాగైనా పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో 'ఉమెన్ ఇన్ బ్లూ' ఉంది.! మరి వన్డేల తరహాలోనే టీ20ల్లోనూ మన సుందరీమణులు చరిత్ర సృష్టిస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.!

గత గాయాలు.. సరికొత్త ఆశలు!

2020 మెల్‌బోర్న్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఘోర పరాభవం.. 2024 యూఏఈ వరల్డ్‌కప్‌లో గ్రూప్ స్టేజ్ నుంచే నిష్క్రమించడం భారత అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. అంతకుముందు 2017, 2022 లలోనూ తృటిలో అవకాశాలు చేజారాయి. అయితే, వన్డేల్లో ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ గతేడాది వరల్డ్‌కప్ గెలిచిన భారత్.. ఇప్పుడు అదే జోష్‌తో టీ20 ప్రపంచకప్‌లోనూ అడుగుపెడుతోంది. ప్రపంచ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుండటంతో జట్టుపై ఒత్తిడి, అంచనాలు భారీగా ఉన్నాయి.

India Women Aim to Erase T20 World Cup Scars in England After Historic ODI Glory

పేలవ ఫామ్ ఆందోళన కలిగిస్తోందా?

ఇటీవలి కాలంలో భారత జట్టు ప్రదర్శన మిశ్రమంగా ఉంది. శ్రీలంక, ఆస్ట్రేలియాలపై సిరీస్ విజయాలు సాధించినప్పటికీ.. సౌతాఫ్రికా చేతిలో 4-1తో, ఇంగ్లండ్ చేతిలో 2-1తో సిరీస్ ఓటములను చవిచూడాల్సి వచ్చింది. మిడిలార్డర్ వైఫల్యం, పేస్ బౌలింగ్ విభాగంలో అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్‌లు ధారాళంగా పరుగులివ్వడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, గతంలోనూ ఆసీస్‌తో సిరీస్ ఓడినా వన్డే వరల్డ్‌కప్ గెలిచిన చరిత్ర భారత్‌కు ఉంది.

లైవ్‌లోనే రిపోర్టర్‌పై విరుచుకుపడ్డ హర్మన్‌ప్రీత్ కౌర్! (వీడియో)

లైవ్‌లోనే రిపోర్టర్‌పై విరుచుకుపడ్డ హర్మన్‌ప్రీత్ కౌర్! (వీడియో)

స్టార్ బ్యాటర్లు ఫామ్‌లోకి రావాలి..

స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నా.. వార్మప్ మ్యాచ్‌ల్లో వారు పరుగులు సాధించడం సానుకూలాంశం. యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్ మంచి టచ్‌లో ఉన్నారు. ఫినిషర్‌గా రిచా ఘోష్ కీలక పాత్ర పోషించనుంది. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన 10వ టీ20 వరల్డ్‌కప్‌లో అనుభవాన్ని ఉపయోగించి జట్టును ముందుండి నడిపించాల్సి ఉంది.

స్పిన్ మంత్రం పారేనా?

ఇంగ్లండ్ పిచ్‌లు పేస్‌కు సహకరించినప్పటికీ.. భారత స్పిన్ ద్వయం శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్ వార్మప్ మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌పై 7 వికెట్లు పడగొట్టి అదరగొట్టారు. వీరితో పాటు దీప్తి శర్మ, తెలుగు తేజం శ్రీ చరణి రూపంలో భారత్‌కు పటిష్టమైన స్పిన్ విభాగం ఉంది. మ్యాచ్‌లను మలుపు తిప్పడంలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు.

జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌తో భారత్ తన ప్రపంచకప్ వేటను ప్రారంభించనుంది. పాత చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ టీమిండియా ఈసారి విశ్వవిజేతగా నిలుస్తుందో లేదో చూడాలి!

భారత మహిళల టీ20 ప్రపంచకప్ టీమ్:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యస్తికా భాటియా, నందిని శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్.

T20 WC: టీమిండియాలో ట్రాన్స్‌జెండర్.. ట్రోలింగ్!

T20 WC: టీమిండియాలో ట్రాన్స్‌జెండర్.. ట్రోలింగ్!
Story first published: Wednesday, June 10, 2026, 16:13 [IST]
Other articles published on Jun 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+