ఉపాధి హామీ కూలిగా మారిన భారత క్రికెటర్

న్యూఢిల్లీ: ఎక్కడి గత్తరనో ఏమో కానీ ఈ కరోనా తెచ్చిన కష్టం అంత ఇంత కాదు. ఈ మహమ్మారి ప్రభావానికి గురికానీ వ్యక్తి ఈ భూమి మీదనే లేడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అగ్ర రాజ్యం నుంచి ఆకలి రాజ్యం వరకు.. సంపన్నుల నుంచి నిరు పేదల వరకు ఈ గత్తరకు ప్రత్యక్షంగానో.. పరోక్షంగానే ప్రభావమైనవాళ్లే.
ముఖ్యంగా టూరిజం, సినీ, మీడియా, క్రీడా రంగాలు పూర్తిగా కుదేలయ్యాయి. వలస జీవులు బతుకు జీవుడా అంటూ సొంత గూటికి చేరారు. ఎందరో ఉద్యోగాలు పోయాయి. మరెందరివో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఇక అంతర్జాతీయంగా మెరిసిన కొందరి ఆటగాళ్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
రెండు రోజుల క్రితమే దినేష్ సెయిన్ అనే అంతర్జాతీయ దివ్యాంగ క్రికెటర్ పొట్ట కూటి కోసం ప్యూన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడనే వార్త చూశాం. చచ్చుబడిన కాలుతో అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించినా.. కుటుంబాన్ని పోషించలేని అతని నిస్సహాయతను విన్నాం. తాజాగా మరో క్రికెటర్ కరోనా పుణ్యమా ఉపాధి హామీ కూలిగా మారాడు.

బుక్కెడు బువ్వ కోసం..
జాతీయ వీల్‌చైర్ క్రికెటర్ అయిన రాజేంద్రసింగ్ ధామి పొట్టకూటి కోసం కూలీగా అవతారమెత్తాడు. ఇన్ని రోజలు ప్రైజ్‌మనీ, స్పాన్సర్‌షిప్‌లు, కోచ్‌గా పనిచేయగా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించిన ధామి.. కరోనాతో రోజు కూలీగా మారాడు. ఉత్తరాఖండ్‌లోని రాయ్‌కోట్‌కు చెందిన రాజేంద్రసింగ్..ప్రస్తుతం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రాళ్లు కొడుతూ రోజులు వెళ్లదీస్తున్నాడు. అయితే ధామి పడుతున్న కష్టాలను మీడియా ద్వారా తెలుసుకున్న భారత ఒలింపిక్ సంఘం రూ.50వేల ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకురాగా, ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూ.20వేలు ప్రకటించింది.

నాకు సాయం అక్కర్లేదు.. కానీ
‘గత మార్చిలో జట్టు కోచ్‌గా నేను బెంగళూరుకు వెళ్లాల్సింది. కానీ దేశంలో విధించిన లాక్‌డౌన్‌తో ఆ టూర్ రద్దవ్వడంతో నాకు కష్టాలు మొదలయ్యాయి. కుటుంబ పోషణకు కష్టమైంది. దీంతో నేను దినసరి కూలీగా పనిచేయాల్సి వచ్చింది. రాళ్లు కొట్టుకుంటూ రోజుకు రూ.400 సంపాదిస్తున్నాను. ఈ పని చేస్తున్నందుకు నేనేం సిగ్గు పడటం లేదు. రోజుకు రెండు పూటలు తినాలంటే కష్టపడటం తప్పదు. అడుక్కుతినడం కంటే ఇలా చేయడం ఎంతో ఉత్తమం. పని చేయడంలో తప్పేం లేదు. నాకు సాయం చేయకున్నా.. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం అండగా నిలవాలి'అని ధామి విజ్ఞప్తి చేశాడు.

రెండేళ్ల వయసులోనే..
ఇక ధామి రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు అతని శరీర కింది భాగంలోని ఎడమవైపు చచ్చుబడిపోయింది. కానీ అతను ఏ మాత్రం కుంగిపోకుండా ఆటలను ఆస్వాదించాడు. క్రికెట్‌లోకి రాకముందు జాతీయ స్థాయిలో షాట్‌పుట్, డిస్కస్ త్రోలో మెడల్స్ సాధించాడు. అనంతరం అతనికున్న అపారమైన బ్యాటింగ్ స్కిల్స్‌తో వీల్ చైర్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications