Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs CSXI ప్రాక్టీస్ మ్యాచ్ షురూ.. 1983 ప్రపంచకప్ హీరో మృతికి సంతాపంగా..

India wear black armbands in honour of Yashpal Sharma during warm-up game against County Select XI

డర్హమ్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు కౌంటీ ఎలెవన్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ సన్నాహక మ్యాచ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే దూరంగా ఉండటంతో రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చెపట్టాడు. అయితే గత మంగళవారం గుండెపోటుతో మరణించిన భారత దిగ్గజ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ హీరో యశ్‌పాల్ శర్మ‌కు రోహిత్ సేన ఘనంగా నివాళులర్పించింది. ఆయన మృతికి సంతాపంగా ఈ సన్నాహక మ్యాచ్‌లో నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది.

'జూలై 13న గుండె పోటుతో మరణించిన భారత దిగ్గజ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ‌కు టీమిండియా నివాళులర్పించింది. ఆయన మృతికి సంతాపంగా బ్లాక్ రిబ్బన్స్ ధరించి బరిలోకి దిగింది. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి.. యశ్‌పాల్ శర్మ టీమ్ మేట్'అని బీసీసీఐ క్యాప్షన్‌గా రాసుకొచ్చింది. 1979-85లో భారత్ జట్టులో నమ్మదగిన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న యశ్‌పాల్ శర్మ రిటైర్మెంట్ తర్వాత నేషనల్ సెలెక్టర్‌గా కూడా పనిచేశాడు. భారత్ గెలిచిన 1983 ప్రపంచకప్‌లోనూ యశ్‌పాల్ శర్మ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు.

ఇక ప్రాక్టీస్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హిట్ మ్యాన్‌ బ్యాటింగ్ తీసుకున్నాడు. మయాంక్ అగర్వాల్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. కానీ హిట్ మ్యాన్ తీవ్రంగా నిరాశపరిచాడు. 9 పరుగులే చేసిన రోహిత్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. మయాంక్ అగర్వాల్( 28 బ్యాటింగ్), పుజారా(1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 11 ఓవర్లలో వికెట్ నష్టానికి భారత్ 38 రన్స్ చేసింది.

ఇక కెప్టెన్, వైస్ కెప్టెన్‌తో పాటు పేసర్లు మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ.. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. రిషభ్ పంత్‌ గైర్హాజరీలో ఈ మ్యాచులో కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ చేయనున్నాడు. కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిన పంత్‌ లండన్‌లో సన్నిహితుల ఇంట్లో 10 రోజులు ఐసోలేషన్‌ పూర్తి చేసుకున్నాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో అతనికి నెగటీవ్ వచ్చింది. బుధవారం అతను డర్హమ్ ప్రాక్టీస్ క్యాంప్‌లో జట్టుతో కలవనున్నాడు. 28 నుంచి ప్రారంభమయ్యే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు.

భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, చేతేశ్వర్ పూజారా, హనుమా విహారి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

Story first published: Tuesday, July 20, 2021, 16:40 [IST]
Other articles published on Jul 20, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+