For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాచ్ గెలిస్తే.. సెమీస్‌కే.. హర్మన్ మరోసారి రెచ్చిపోతే!!

India Women vs Ireland W ICC Womens World 2018,T20:Indian Team keep An Eye On Semis To Win| Oneindia
India W vs Ireland W, ICC Womens World T20 live streaming: When and where to watch, Telecast, Time in IST

హైదరాబాద్: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో దుమ్మురేపుతున్న టీమిండియా సెమీస్‌ బెర్త్‌పై కన్నేసింది. వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న భారత్‌ గురువారం జరగనున్న తమ మూడో గ్రూప్‌- బి పోరులో ఐర్లాండ్‌తో తలపడనుంది. వెస్టిండీస్‌లో జరగనున్న ఈ టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది హర్మన్‌ప్రీత్‌ జట్టు.

 మెరుపు సెంచరీతో జట్టును గెలిపించిన న్యూజిలాండ్‌

మెరుపు సెంచరీతో జట్టును గెలిపించిన న్యూజిలాండ్‌

హ్యాట్రిక్‌ విజయంతో నాకౌట్‌కు చేరాలని హర్మన్‌ప్రీత్‌ సేన పట్టుదలగా ఉంది. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలిచిన ఆత్మవిశ్వాసంతో భారత్‌ బరిలోకి దిగనుంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ భీకరఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశం. హర్మన్‌ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై మెరుపు సెంచరీతో జట్టును గెలిపించింది. ఇక పాక్‌పై భారత్‌ను గెలిపించడంలో సీనియర్‌ బ్యాట్స్‌వుమన్‌ మిథాలీ కీలక పాత్ర పోషించింది.

22 మందిని ఉంచుకుని ముగ్గురిని తప్పించిన సూపర్ కింగ్స్

మిథాలీ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌

మిథాలీ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌

దీంతో మరోసారి హర్మన్‌ప్రీత్‌, మిథాలీ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది. జెమీమా, స్మృతి, వేద కృష్ణమూర్తిలతో మిడిలార్డర్‌ పటిష్ఠంగా ఉంది. యువ క్రీడాకారిణి జెమీమా రొడ్రిగ్స్‌, డ్యాషింగ్‌ ఓపెనర్‌ స్మృతి మంధానా సమయోచితంగా పరుగులు చేస్తున్నారు. తమదైన రోజున వీరిద్దరూ ఎలా చెలరేగుతారో అందరికీ తెలిసిందే. ఇక మిడిలార్డర్‌లో వేదకృష్ణమూర్తి ఫర్వాలేదనిపిస్తోంది. టీమిండియా బౌలింగ్‌ పరంగానే ఇంకా మెరుగు పడాల్సి ఉంది.

ఐర్లాండ్‌ చిన్న జట్టే అయినా

ఐర్లాండ్‌ చిన్న జట్టే అయినా

లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌, ఆఫ్‌బ్రేక్‌ బౌలర్‌ హేమలత స్పిన్‌ విభాగానికి నేతృత్వం వహించనున్నారు. హేమలత, పూనమ్‌ యాదవ్‌ కలిసి ఇప్పటి వరకు 10 వికెట్లు తీశారు. మిగతా సీమర్లు ఆశించిన రీతిలో ఆడాల్సి ఉంది. ఐర్లాండ్‌ చిన్న జట్టే అయినా పోరాడగలదు. అందుకే ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోమని కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. కాగా ఆస్ట్రేలియా చేతిలో 9 వికెట్ల తేడాతో, పాక్‌తో 38 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ ఘోర ఓటములు చవిచూసింది.

ఆదివారం జరిగే పోరే భారత్‌కు కీలకం

ఆదివారం జరిగే పోరే భారత్‌కు కీలకం

తొలి రెండు ఐర్లాండ్‌ మ్యాచ్‌ల్లో ఓడింది. ఈ మ్యాచ్‌లో నెగ్గితేనే ఆ జట్టుకు నాకౌట్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే బ్యాటింగ్‌, బౌలింగ్‌ వైఫల్యం ఆ జట్టును వేధిస్తోంది. ఈ నేపథ్యంలో పటిష్ఠ భారత్‌ను ఐర్లాండ్‌ ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరం. దీంతో పాటుగా ఆసీస్‌తో ఆదివారం జరిగే పోరే భారత్‌కు అత్యంత కీలకం. బలమైన కంగారూ జట్టుపై గెలిస్తే సెమీస్‌ ముందు భారత్‌లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. హర్మన్‌సేన సెమీస్‌లో ఇంగ్లాండ్‌ లేదా వెస్టిండీస్‌తో తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత జట్టు:

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన, మిథాలీ రాజ్‌, జెమీమా రోడ్రిగ్స్‌, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, తానియా భాటియా, పూనమ్‌ యాదవ్‌, రాధా యాదవ్‌, అనుజా పాటిల్‌, ఏక్తా బిష్ఠ్‌, హేమలత, మాన్సి జోషి, పూజా వస్త్రకార్‌, అరుంధంతీ రెడ్డి.

Story first published: Thursday, November 15, 2018, 11:33 [IST]
Other articles published on Nov 15, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+