For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

22 మందిని ఉంచుకుని ముగ్గురిని తప్పించిన సూపర్ కింగ్స్

IPL 2019 : CSK Retains Group For IPL 12,Releases Mark Wood & 2 Uncapped Players | Oneindia Telugu
 Chennai Super Kings release three players ahead of IPL 2019 player auction, MS Dhoni and core group retained

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లిగ్ (ఐపీఎల్) డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మరో టైటిల్‌పై కన్నేసింది. వచ్చే ఐపీఎల్ కోసం అప్పుడే కసరత్తులు మొదలుపెట్టింది ఆ ఫ్రాంచైజీ. ఐపీఎల్-2019 కోసం చెన్నై సూపర్‌ కింగ్స్ తమ రిటైన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. తమ జట్టులోని 22 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. కాగా, ముగ్గురు ఆటగాళ్లను విడుదల చేస్తున్నట్టు సీఎస్‌కే యాజమాన్యం ప్రకటించింది.

రెండేళ్ల సస్పెన్షన్ తర్వాత బరిలోకి దిగి

రెండేళ్ల సస్పెన్షన్ తర్వాత బరిలోకి దిగి

నవంబర్ 14న సీఎస్‌కే యాజమాన్యం ఈ విషయాన్ని వెల్లడించింది. 2018 ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు ఒక్క మ్యాచ్‌లో ప్రాతినిథ్యం వహించిన వుడ్ వికెట్ తీయలేకపోయాడు. క్షితిజ్, సేత్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇంగ్లాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌తోపాటు దేశవాళీ ఆటగాళ్లు కనిష్క్‌, కితిజ్‌ శర్మలను జట్టు నుంచి విడుదల చేసింది.

రెండేళ్ల సస్పెన్షన్ తర్వాత బరిలోకి దిగి టైటిల్ కొట్టిన చెన్నై.. ఈసారి కూడా పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది.

కేదార్ జాదవ్ స్థానంలో జట్టులోకి వచ్చిన డేవిడ్ విల్లే

కేదార్ జాదవ్ స్థానంలో జట్టులోకి వచ్చిన డేవిడ్ విల్లే

గత సీజన్లో గాయపడ్డ కేదార్ జాదవ్ స్థానంలో జట్టులోకి వచ్చిన డేవిడ్ విల్లేకు ఫ్రాంచైజీ మరో అవకాశమిచ్చింది. వచ్చే సీజన్ సైతం ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోనే చెన్నై ముందుకు సాగనుంది. గాయంతో సీజన్‌కు దూరమైన ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌ను, అతని స్థానంలో తీసుకున్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లేను కూడా రిటైన్ చేసుకుంది. ఐపీఎల్-11లో వుడ్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడగా, కనిష్క్, క్షితిజ్ శర్మ మాత్రం బరిలోకే దిగలేదు.

మొత్తం రూ. 8.5 కోట్లను ఈసారి వేలంలో

మొత్తం రూ. 8.5 కోట్లను ఈసారి వేలంలో

ధోనీ, రైనా, హర్భజన్, జడేజా, డుప్లెసిస్, డేన్ బ్రావో రిటైన్ జాబితాలో ఉన్నారు. ముగ్గురు ఆటగాళ్లను వదిలేయడం వల్ల వచ్చిన రూ. 2 కోట్లు, గతేడాది మిగిలిన రూ. 6 కోట్లు కలిపి మొత్తం రూ. 8.5 కోట్లను ఈసారి వేలంలో సీఎస్‌కే ఖర్చు చేయొచ్చు.

ఐపీఎల్ 12 కోసం డిసెంబర్ నెలలో ఆటగాళ్ల వేలం

ఐపీఎల్ 12 కోసం డిసెంబర్ నెలలో ఆటగాళ్ల వేలం

ఐపీఎల్ 12 కోసం డిసెంబర్ నెలలో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. కాంట్రాక్ట్ పూర్తయిన ఆటగాళ్లతో పాటు నిరాశ పరిచిన వారిని ఫ్రాంచైజీలు వదులుకుంటున్నాయి. నవంబర్ 15లోగా ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను అందించాలని ఐపీఎల్ నిర్వాహకులు సూచించిన విషయం తెలిసిందే.

Story first published: Thursday, November 15, 2018, 9:09 [IST]
Other articles published on Nov 15, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+