For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Zimbabwe 2nd ODI: దీపక్ చాహర్ ఎందుకు ఆడటం లేదంటే..?

India vs Zimbabwe 2nd ODI: Why Deepak Chahar isnt playing despite taking 3 wickets in 1st match

హరారే: జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా మరోసారి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో ఇలానే ముందుగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి 189 పరుగులకే పరమితం చేసిన రాహుల్ సేన.. ఆ లక్ష్యాన్ని అలవోకగా చేధించి 10 వికెట్లతో విజయాన్నందుకుంది. రెండో వన్డేలోనూ అదే తరహాలో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటుంది. టాస్ గెలిచిన రాహుల్ ఏ మాత్రం సంశయించకుండా మరోసారి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. దీపక్ చాహర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు.

 దీపక్ చాహర్ మళ్లీ గాయపడ్డాడా?

దీపక్ చాహర్ మళ్లీ గాయపడ్డాడా?

అయితే ఈ మార్పు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేయడేమ కాకుండా కలవరపాటుకు గురి చేసింది. తొడ కండరాలు గాయం.. ఆ తర్వాత వెన్ను గాయంతో ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న దీపక్ చాహర్.. జింబాబ్వేతో తొలి వన్డేతో మైదానంలోకి అడుగుపెట్టాడు. రీఎంట్రీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. మూడు వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించాడు. పవర్ ప్లేలోనే ఆతిథ్య ఓపెనర్లను పెవిలియన్ చేర్చాడు. అంత అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన తర్వాత దీపక్ చాహర్‌ను రెండో వన్డేకు పక్కనపెట్టడం అనేక అనుమానాలకు తావిస్తుంది. అతను మళ్లీ గాయపడ్డాడా? ఏమైనా ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడా? దీర్ఘకాల సమస్యలతో బాధపడుతున్నాడా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

 ఫిట్ నెస్ సమస్యలతోనే..

ఫిట్ నెస్ సమస్యలతోనే..

కెప్టెన్ రాహుల్ కూడా దీపక్ చాహర్‌ను ఎందుకు పక్కనపెట్టామనే విషయాన్ని వెల్లడించలేదు. కేవలం దీపక్ చాహర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగుతున్నాడని చెప్పాడు. అంతే తప్పా చాహర్ గురించి మరో ముచ్చట మాట్లాడలేదు. క్రిక్‌బజ్, ఈఎస్‌పీఎన్ క్రిక్‌‌ఇన్‌ఫో మాత్రం.. చిన్నగాయంతో దూరమయ్యాడని తెలిపాయి. బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పటి వరకు అయితే దీపక్ చాహర్ దూరమవ్వడానికి కచ్చితమైన కారణం తెలియలేదు. అయితే ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో దీపక్ చాహర్ గాయపడవద్దనే ముందస్తు జాగ్రత్తగా టీమ్‌మేనేజ్‌మెంట్ రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

31 పరుగులకే 4 వికెట్లు..

31 పరుగులకే 4 వికెట్లు..

ఇక దీపక్ చాహర్ లేకున్నా భారత్ బౌలర్లు జింబాబ్వే పనిపట్టారు. శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్‌లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వే 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ కైటానో(7)ను కీపర్ క్యాచ్‌గా సిరాజ్ పెవిలియన్ చేర్చగా.. మరో ఓపెనర్ ఇన్నోసెంట్ కియా(16), కెప్టెన్ రెగిస్ చకబ్వా(2)లను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేశాడు. వెస్లీ(2)ని ప్రసిధ్ పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం క్రీజులో సికిందర్ రాజా(15 బ్యాటింగ్), సీన్ విలియమ్స్(23 బ్యాటింగ్) ఉన్నారు.

Story first published: Saturday, August 20, 2022, 14:36 [IST]
Other articles published on Aug 20, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+