Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM 2nd ODI: పసలేదు! ఏ మాత్రం నొప్పిలేకుండా గెలిచిన టీమిండియా... సిరీస్ కైవసం!

India vs Zimbabwe 2nd ODI: Clinical India beat Zimbabwe by 5 wickets to seal series

హరారే: జింబాబ్వే గడ్డపై టీమిండియా దుమ్మురేపింది. ఊహించనట్లుగానే మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. శనివారం ఏకపక్షంగా సాగిన రెండో వన్డేలో సమష్టిగా రాణించిన టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. సిరీస్ ప్రారంభానికి ముందు గట్టి పోటీనివ్వడం కాదు.. టీమిండియాను ఓడిస్తామని ప్రగల్భాలు పలికిన జింబాబ్వే ఆ మాటను నిలబెట్టుకోలేకపోయింది. తొలి వన్డే మాదిరే జింబాబ్వే ఓటమికి తల వంచింది. భారత్ జట్టు సమష్టి ప్రదర్శన ముందు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 38.1 ఓవర్లలోనే 161 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి కనీసం 50 ఓవర్లు కూడా క్రీజులో నిలవలేకపోయింది. ఆ జట్టులో సీన్ విలియమ్స్(42), ర్యాన్ బర్ల్(39 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 25.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. తొలి వన్డే మాదిరి నిదానంగా ఆడకుండా దూకుడుగా ఆడిన భారత్ 154 బంతుల్లోనే విజయాన్నందుకుంది. మరోసారి శిఖర్ ధావన్(21 బంతుల్లో 4 ఫోర్లతో 33), శుభ్‌మన్ గిల్(34 బంతుల్లో 6 ఫోర్లతో 33) ఫర్వాలేదనిపించగా.. సంజూ శాంసన్(39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 43 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. కేఎల్ రాహుల్(1), ఇషాన్ కిషన్(6) విఫలమవ్వగా.. దీపక్ హుడా(25) పర్వాలేదనిపించాడు. జింబాబ్వే బౌలర్లలో లూక్ జాంగ్వే రెండు వికెట్లు తీయగా.. తానక చివంగా, విక్టర్ న్యూచి, సికిందర్ రాజా తలో వికెట్ తీసారు.

తొలి వన్డే మాదిరే ఈ మ్యాచ్ కూడా చాలా బోరింగ్‌గా సాగింది. దాంతో ఈ మ్యాచ్‌ను కూడా జనాలు లైట్ తీసుకున్నారు. టాస్ గెలిచిన కేఎల్ రాహుల్ బ్యాటింగ్ తీసుకోకుండా ఫీల్డింగ్ తీసుకోవడం అభిమానులకు ఆగ్రహం కలిగించింది. రాహుల్ నిర్ణయం అధికారిక బ్రాడ్ కాస్టర్ సోనీ నెట్‌వర్క్‌కు కూడా తీరని నష్టం తెచ్చింది. వ్యూయర్ షిప్ లేక స్పాన్సర్స్ రాక కోట్లలో నష్టపోయింది. జింబాబ్వేతో వన్డేలకు బదులు టీ20 సిరీస్‌ నిర్వహించాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక నామమాత్రపు చివరి వన్డే సోమవారం జరగనుంది.

Story first published: Saturday, August 20, 2022, 18:40 [IST]
Other articles published on Aug 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+