Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జింబాబ్వే హోటల్లో రేప్: నిందితులను గుర్తించారు.. వీరే

హరారే: జింబాబ్వేలోని హరారేలో యువతిని వేధించిన ఇద్దరు నిందితులను స్థానిక పోలీసులు గుర్తించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టీమిండియా జింబాబ్వే పర్యటనలో ఉంది. భారత జట్టుకు చెందిన వారు యువతిని వేధించినట్లుగా స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.

India vs Zimbabwe 2016: Company of rape accused promises full cooperation

వాటిని అందరు కూడా ఖండించారు. అయితే, యువతిని వేధించిన అసలు నిందితులను స్థానిక పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఇద్దరు కూడా భారత్‌కు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారని అంటున్నారు.

షాకింగ్, జింబాబ్వే హోటల్లో రేప్: 'టీమిండియా క్రికెటర్ అరెస్ట్' అబద్దం

నిందితులను కృష్ణ సత్యనారాయణ, రాజ్ కుమార్‌లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. మొదటి వ్యక్తి క్రీడలతో సంబంధం ఉన్న వ్యక్తి కాగా, రెండో వ్యక్తి జింబాబ్వే బేస్డ్ బిజినెస్‌మ్యాన్ అని తెలుస్తోంది. మొదటి వ్యక్తి కన్సల్టెంట్‌గా పని చేస్తున్నాడని చెబుతున్నారు.

వీరిద్దరు కూడా స్థానిక మీక్లెస్ హోటల్లో ఉంటున్నారని, ఇదే హోటల్లో అత్యాచార ఆరోపణలు వచ్చాయని పోలీసులు చెబుతున్నారు. కాగా, కేసు విచారణకు సహకరిస్తామని వీరిద్దరు పని చేసే సంస్థలు పోలీసులకు చెప్పాయని తెలుస్తోంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+