న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షాకింగ్, జింబాబ్వే హోటల్లో రేప్: 'టీమిండియా క్రికెటర్ అరెస్ట్' అబద్దం

హరారే: జింబాబ్వేలో పర్యటిస్తున్న భారత జట్టులోని ఓ సభ్యుడి పైన తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే, ఆ వార్తలు నిజం కాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. జింబాబ్వే పర్యటనలో టీమిండియా సభ్యుడు ఒకరు మహిళను వేధించిన నేపథ్యంలో రేప్ ఛార్జ్ ఎదుర్కొంటున్నారని వార్తలు వచ్చాయి.

స్థానిక న్యూస్ వెబ్ సైట్ ఒకటి ఓ వార్త రాసింది. జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా సభ్యుడిని ఒకరిని పోలీసులు అరెస్టు చేశారని, స్థానిక మహిళను వేధించినందుకు అరెస్టు చేశారని సదరు వెబ్ సైట్ రాసింది. అయితే, అతని పేరు మాత్రం పేర్కొనలేదు.

అంతేకాదు, అతను ఆటగాడా లేక అధికారా అని కూడా వెల్లడి కాలేదని వార్తలు వస్తున్నాయి. అతనిని కోర్టులో హాజరుపరిచామని, ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉందని కూడా స్థానిక వెబ్ సైట్ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

Member of Indian cricket contingent in Zimbabwe arrested on alleged rape charges: Reports

ఏ భారత క్రికెటర్ అరెస్ట్ కాలేదు

ఇదిలా ఉండగా, టీమిండియా ఆటగాడు అరెస్టయ్యాడన్న వార్తల పైన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఏ భారత క్రికెటర్ కూడా అరెస్టు కాలేదని తెలిపింది.

హరారే హోటల్లో రేప్ ఘటనకు సంబంధించి టీమిండియా క్రికెటర్ పాత్ర ఉందంటూ వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించింది.త అసలు రేప్ ఘటనకు, భారత క్రికెట్‌కు ఎటువంటి సంబంధం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. అదంతా తప్పుడు ప్రచారమని, ఈ ఘటనలో ఏ ఒక్క టీమిండియా క్రికెటర్ లేదా ఇతరులు అరెస్టు కాలేదని పేర్కొంది.

రాయబారితో మాట్లాడాం

మేం జింబాబ్వేలో ఉన్న భారత రాయబారితో మాట్లాడామని, అది ఒక తప్పుడు వార్త అని, రేప్ ఘటనలో టీమిండియా సభ్యుల పాత్ర లేదని పేర్కొంది. ఒక స్పాన్సర్ పాత్ర ఉన్నట్లు తెలిసిందని, కానీ అతను కూడా వార్తను ఖండించాడని, డీఎన్ఏ టెస్టు ద్వారా తన నిజాయితీని నిరూపించుకోవడానికి సిద్ధమయ్యాడని పేర్కొంది.

హరారే హోటల్లో రేప్ జరిగిందని, అందులో టీమిండియా క్రికెటర్ పాత్ర ఉందని జింబాబ్వే డైలీలో వచ్చిన వార్తలు కలకలం సృష్టించాయి. ఈ వార్త భారత మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చింది.

హరారేలోని మీక్‍‌లెస్ హోటల్లో తనకు డ్రగ్స్ ఇచ్చి కొంతమంది అత్యాచారం చేశారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అయితే, అదే హోటల్లో టీమిండియఆ బస చేసింది. దీంతో క్రికెటర్లపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు అసలు మహిళ రేప్‌కు గురైందా లేదా కూడా తేలాలని అంటున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X