Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: త్రిపాఠికి మళ్లీ నిరాశే.. ఇషాన్‌, దీపక్ చాహర్ రీఎంట్రీ! జింబాబ్వేదే బ్యాటింగ్!

India vs Zimbabwe 1st ODI: KL Rahul opts to bowl, Deepak Chahar returns after injury layoff

హరారే: జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితులను చూసే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పష్టం చేశాడు. 'ముందుగా బౌలింగ్ చేస్తాం. చూడటానికి వికెట్ బాగుంది. చాలా త్వరగా ప్రారంభమవుతుంది కాబట్టి వికెట్‌పై కాస్త మాయిశ్చర్ ఉండే అవకాశం ఉంది. ముందుగా బౌలింగ్ చేయడం మంచి అవకాశం.

చాలా మంది ఆటగాళ్లకు అవకాశం దక్కింది. సత్తా చాటేందుకు వారికి ఇది సువర్ణ అవకాశం. మంచి ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాం. దీపక్ చాహర్ చాలా రోజులుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. రీఎంట్రీ ఇచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నాడు'అని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో కూడా రాహుల్ త్రిపాఠికి అవకాశం దక్కలేదు. అతనికి బదులు ఇషాన్ కిషన్‌కే అవకాశం ఇచ్చారు. బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్ అవకాశం అందుకోలేకపోయారు.

జింబాబ్వే సారథి రెగిస్ చక్‌బ్వా మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ ఎంచుకునే వాళ్లమని చెప్పాడు. భారత్ విసిరిన ఈ సవాల్ స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నామని పేర్కొన్నాడు.

తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్(కెప్టెన్), దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్

జింబాబ్వే: తకుండ్జ్‌వనషే కైటానో, మరుమణి, కైయా, వెస్లీ, సికందర్‌ రజా, చకాబ్వా (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), ర్యాన్‌ బర్ల్‌/టోనీ మన్యోంగా, లూక్‌ జాంగ్‌వి, బ్రాడ్‌ ఇవాన్స్‌, విక్టర్‌ ఎన్‌యౌచి, తనాక చివాంగ.

Story first published: Thursday, August 18, 2022, 12:45 [IST]
Other articles published on Aug 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+