India vs Zimbabwe నేడే తొలి వన్డే.. కేఎల్ రాహుల్‌పైనే అందరి కళ్లు! హరారే వాతవారణం ఎలా ఉందంటే..?

హరారే: మరో రెండు నెలల్లో టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో.. వన్డేలను కూడా పొట్టి ఫార్మాట్ దృష్టితోనే చూస్తున్నారు. ఈ క్రమంలో జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగే తొలి మ్యాచ్‌లో భారత్ ధనాధన్ ఆటతో అదరగొట్టాలని చూస్తోంది. కాగా, టీ20 వరల్డ్‌కప్‌లో కీలక ఆటగాడిగా భావిస్తున్న కేఎల్ రాహుల్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత శస్త్ర చికిత్స, కొవిడ్ బారినపడిన రాహుల్‌కు ఈ సిరీస్‌లో రాణించడం ఎంతో కీలకం. రెండు నెలలకుపైగా ఆటకు దూరంగా ఉన్న అతను.. ఫిట్‌నెస్‌తోపాటు ఫామ్‌ను నిరూపించుకొంటే వరల్డ్‌కప్‌లో టీమిండియాకు ఓపెనర్ సమస్య తీరుతుంది. ఆసియా కప్‌లో ఈనెల 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు రాహుల్ ఆట గాడినపడాలని రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్ ఆశిస్తున్నారు.

రాహుల్‌పైనే ఫోకస్
ఈ సిరీస్ సందర్భంగా కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ చూసేది కేవలం రాహుల్ చేసే పరుగులనే కాదు.. వాటిని ఎలా సాధిస్తున్నాడు, ఎంత దూకుడు ప్రదర్శిస్తున్నాడన్నదాన్ని కూడా. ఆసియాకప్ ఆరంభానికి ముందు ఈ విషయంలో రాహుల్ కొంత మెరుగుపడాల్సివుంది. మరోవైపు..మ్యాచ్ వేదిక హరారె స్పోర్ట్స్ క్లబ్‌లో ఇటీవల ముగిసిన సిరీస్‌లో బంగ్లాదేశ్‌పై జింబాబ్వే వరుసగా 300, 290పై లక్ష్యాలను ఛేదించడం గమనార్హం. అయితే రాహుల్, ధావన్, గిల్, దీపక్ హుడా, సంజు శాంసన్‌లతో కూడిన భారత లైనప్‌ను నియంత్రించడం ఆతిథ్య జట్టుకు పెను సవాలే. బంగ్లాదేశ్‌లా కాకుండా.. ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్, కుల్‌దీప్ యాదవ్‌లతో భారత బౌలింగ్ బలంగా ఉంది.

పటిష్టంగా భారత్..
ఆల్‌రౌండర్లు శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా జింబాబ్వే లైనప్‌ను దెబ్బతీయగలరు. గాయాల కారణంగా దూరమై ఆరు నెలల తర్వాత జట్టులోకి వచ్చిన దీపక్ చాహర్ తిరిగి ఫామ్‌ను అందుకోవాలనుకుంటున్నాడు. భువనేశ్వర్ ఇప్పటికే టీ20 జట్టులో స్థానాన్ని బలోపేతం చేసుకున్న నేపథ్యంలో.. తన స్వింగ్ బౌలింగ్, ఆఖరి ఓవర్లలో భారీ షాట్లు ఆడగల బ్యాటింగ్ సామర్థ్యంతో చాహర్ ఆకట్టుకోవాలనుకుంటున్నాడు.
ఆసియాకప్ జట్టులో అతను ఇప్పటికే స్టాండ్‌బైగా ఉన్నాడు. నెమ్మదిగా ఒకప్పటి జోరును అందుకుంటున్న కుల్‌దీప్ కూడా సత్తా చాటాలనుకుంటున్నాడు. ఐపీఎల్‌లో నిలకడగా రాణించిన రాహుల్ త్రిపాఠి ఈ సిరీస్‌తో వన్డే అరంగేట్రం చేసే అవకాశముంది. మిడిల్ ఆర్డర్‌లో అతణ్ని ఆడించవచ్చు.

జోష్‌లో చికాబ్వా సేన..:
మరోవైపు బంగ్లాదేశ్‌పై భారీ స్కోర్లను ఛేదించిన ఆత్మవిశ్వాసంలో ఉన్న చికాబ్వా సేన.. భారత్‌కు షాకివ్వాలని చూస్తోంది. సికందర్ రజా, చికాబ్వా, ఇన్నోసెంట్ కయా ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. కానీ, బంగ్లా కంటే ఎంతో మెరుగైన టీమిండియా బౌలింగ్‌ను వీరు ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి. మొత్తంగా చూస్తే పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

పిచ్/వాతావరణం:
హరారే వికెట్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఇటీవలే బంగ్లాతో జరిగిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే, ఉదయం పేసర్లకు కొంత అనుకూలించే అవకాశం ఉంది. వాతావరణం సాధారణంగా, పొడిగా ఉండనుంది. ఎలాంటి వర్ష సూచనలేదు.

జట్లు (అంచనా)
భారత్: శిఖర్ ధవన్, గిల్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజూ శాంసన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్/దీపక్ చాహర్, కుల్దీప్, సిరాజ్, ప్రసిద్ధ్/అవేశ్ ఖాన్.
జింబాబ్వే: తకుండ్జ్‌వనషే కైటానో, మరుమణి, కైయా, వెస్లీ, సికందర్ రజా, చకాబ్వా (కెప్టెన్, వికెట్ కీపర్), ర్యాన్ బర్ల్/టోనీ మన్యోంగా, లూక్ జాంగ్‌వి, బ్రాడ్ ఇవాన్స్, విక్టర్ ఎన్‌యౌచి, తనాక చివాంగ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications