IND vs WI తొలి టీ20కి వర్ష గండం.. గంట పాటు దంచికొట్టనున్న వాన! డీఎల్‌ఎస్ బెన్‌ఫిట్ ఎవరికో..?

టరౌబా (పోర్ట్ ఆఫ్ స్పెయిన్): మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా.. ఇప్పుడు ధనాధన్ ఫార్మాట్‌లో అదరగొట్టేందుకు సిద్ధమైంది. అయితే యువ ఆటగాళ్లతో కూడిన ద్వితీయ శ్రేణి జట్టు చేతిలోనే 0-3తో వైట్‌వాష్ అయిన వెస్టిండీస్.. ఇప్పుడు స్టార్ క్రికెటర్లతో కూడిన పూర్తి స్థాయి జట్టును ఎలా ఎదుర్కోనుందో చూడాల్సిందే. వన్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, భువనేశ్వర్ రాకతో జట్టు మరింత పటిష్టంగా తయారైంది.
ఇక ప్రపంచకప్‌నకు మూడు నెలల సమయం కూడా లేకపోగా, భారత్ గరిష్టంగా 16 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులోనే తమ వరల్డ్‌కప్ సైన్యాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి జరిగే ఐదు టీ20ల సిరీస్ జట్టులో బెర్త్ ఆశించే ఆటగాళ్లకు కీలకం కానుంది.

వర్ష గండం..
అయితే తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో ఓవర్లను కుదించి డక్‌వర్త్ లూయిస్ పద్దతిన మ్యాచ్ నిర్వహించారు. నేడు జరిగే టీ20లో కూడా ఇదే పరిస్థితి తలెత్తనుంది. మేఘాలు మబ్బులతో కమ్ముకోనున్నాయి. 24-52 శాతం వర్షం రానుంది. కనీసం ఒక గంట పాటు వాన దంచికొట్టనుంది. ఇదే జరిగితే ఆట ఆలస్యంగానైనా ప్రారంభం కావచ్చు. లేదా ఓవర్లు కుదించాల్సి రావచ్చు. అప్పుడు డక్‌వర్త్ లూయిస్ పద్దతి జట్లకు సవాల్ కానుంది. అయితే ఒక్క ఓవర్ ఆట సాధ్యమయ్యే అవకాశాలున్నా మ్యాచ్ నిర్వహిస్తారు. ఉష్ణోగ్రతలు 24-31 డిగ్రీల సెల్సియస్ నమోదు కానున్నాయి.

పిచ్ రిపోర్ట్..
బ్రియాన్ లారా స్టేడియంలోని పిచ్ టీ20 ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ ఇప్పటి వరకు కరేబియన్ ప్రీమియర్ లీగ్, మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌లే జరిగాయి. పురుషుల అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించడం ఇదే తొలిసారి. పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో చేజ్ చేసిన జట్లే విజయాన్నందుకున్నాయి. టాస్ గెలిచిన జట్లు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపవచ్చు.

రోహిత్‌కు తోడు ఎవరు?
కేఎల్ రాహుల్ కరోనాతో దూరమవ్వడంతో రోహిత్‌కు జతగా ఇన్నింగ్స్‌ను ఆరంభించేందుకు పంత్‌ను కొనసాగిస్తారా? లేక ఇషాన్‌ను ఆడిస్తారా? అనేది తేలాల్సి ఉంది. మూడో నెంబర్‌లో శ్రేయస్‌సకన్నా దీపక్ హుడాకే చాన్స్ ఉంది. సూర్యకుమార్ ఆ తర్వాత ఆడతాడు. ఇషాన్ ఓపెనర్‌గా వస్తే ఐదో నెంబర్‌లో పంత్ ఖాయం. అనంతరం హార్దిక్, దినేశ్ కార్తీక్‌ల రూపంలో హిట్టర్స్ సిద్ధంగా ఉంటారు. అయితే జడేజా ఫిట్‌గా ఉంటే డీకే బెంచీకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఇద్దరు పేసర్లతో వెళితే అతడిని భర్తీ చేయవచ్చు. జడ్డూ ఫిట్‌గా లేకపోతే అశ్విన్, అక్షర్, కుల్డీప్‌ను ఆడించొచ్చు. పేస్ విభాగంలో భువనేశ్వర్, హర్షల్ తుది జట్టులో ఉంటారు. మూడో పేసర్ అవసరమనుకుంటే అర్ష్‌దీప్‌ను బరిలోకి దింపొచ్చు.

పటిష్టంగా విండీస్..
వన్డే సిరీస్‌లో చిత్తయిన విండీస్ పొట్టి ఫార్మాట్‌లో సత్తా చూపాలనుకుంటోంది. టీ20 స్పెషలిస్ట్‌లతో పాటు హార్డ్ హిట్టర్లతో కూడిన ఈ జట్టు ఇటీవలే బంగ్లాదేశ్‌పై 2-0తో సిరీస్ గెలిచింది. ఇప్పుడు అదే జట్టుతో బరిలోకి దిగి భారత్‌పైనా బదులు తీర్చుకోవాలనుకుంటోంది. కెప్టెన్ పూరన్, కింగ్, మేయర్స్, పావెల్ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసివచ్చే విషయం. ఆల్‌రౌండర్ హోల్డర్ భారీ షాట్లు కూడా ఆడగలడు.

తుది జట్లు (అంచనా)
భారత్:రోహిత్, ఇషాన్, దీపక్ హుడా, సూర్యకుమార్, పంత్, హార్దిక్, దినేశ్ కార్తీక్/జడేజా, అశ్విన్/అక్షర్, హర్షల్, భువనేశ్వర్, కుల్దీప్.
వెస్టిండీస్:హోప్, మేయర్స్, బ్రూక్స్, కింగ్, పూరన్ (కెప్టెన్), పావెల్, కార్టీ, హోల్డర్, హోసెన్, మోతీ, జోసెఫ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications