వెస్టిండీస్‌తో తొలి టెస్ట్.. నలుగురు బౌలర్ల వ్యూహంతో భారత్?

ఆంటిగ్వా: వెస్టిండీస్‌తో గురువారం రాత్రి ప్రారంభం కానున్న తొలి టెస్టులో టీమిండియా నలుగురు బౌలర్లతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం తెలుస్తోంది. ఐదుగురు స్పెషలిస్టు బౌలర్లతో మ్యాచ్‌కు సిద్ధం కావాలా లేదా నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో వెళ్లాలా అనే సందేహాలు ఉండేవి. అయితే పిచ్‌ను బట్టి ఇద్దరు లేదా ముగ్గురు పేసర్లను తీసుకుంటామని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ సూచన చేశాడు. దీంతో తుది జట్టుటపై కొంత క్లారిటీ వచ్చింది. అయితే ఈ రోజు ఆడే పిచ్‌పై తాజాగా ఇంగ్లాండ్‌ను విండీస్ జట్టు మట్టికరిపించిన విషయం తెలిసిందే.

పిచ్ చూసిన తర్వాతే:
విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'కవర్లు కప్పి ఉంచడంతో పిచ్‌ను ఇంకా పరిశీలించలేదు. పిచ్‌ను చూసిన తర్వాత ముగ్గురు పేసర్లు-ఒక స్పిన్నర్.. లేదా ఇద్దరు పేసర్లు-ఇద్దరు స్పిన్నర్లను ఎంచుకుంటాం. ఏ నిర్ణయమైనా పిచ్‌ను చూసిన తర్వాత తీసుకుంటాం. ఈ పిచ్‌పై చివరి మ్యాచ్‌ను ఇంగ్లాండ్ ఆడింది. అప్పుడు వైవిధ్యమైన బౌన్స్ కనిపించింది. అన్ని చూసుకుని పరిస్థితులకు తగ్గట్టు బౌలర్లను ఎంచుకుంటాం' అని కోహ్లీ తెలిపాడు.

పొరపాట్లను త్వరగా సరిదిద్దుకోవాలి:
'ఆసీస్ పర్యటనలో భాగంగా పెర్త్‌లో ఓటమి అనంతరం ఏం చేయాలో అర్థమైంది. పక్కా ప్రణాళికలు అమలు చేసి సిరీస్ గెలిచాం. టెస్టు క్రికెట్‌లో పొరపాట్లను త్వరగా సరిదిద్దుకోవాలి. ఓటముల నుంచి ఎంత త్వరగా పాఠాలు నేర్చుకుంటే.. అంత ఉపయోగపడుతుంది. ఒక్క సెషన్‌లో 6 వికెట్లు కోల్పోవద్దు. అలాచేస్తే.. ఎప్పటికీ పుంజుకోలేం. టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో పోటీ ఎక్కువైంది. అగ్రస్థానంలో నిలవాలంటే తీవ్రంగా శ్రమించాలి' అని కోహ్లీ పేర్కొన్నాడు.
'విండీస్‌పై ఐదుగురు బౌలర్లతో దిగితే రహానేకే అవకాశం ఇవ్వాలి'

అశ్విన్ ఆడే అవకాశాలు ఎక్కువ:
20 వికెట్లు తీయాలనే ఉద్దేశంతో సాధారణంగా కోహ్లీ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగేందుకు ఇష్టపడతాడు. అయితే రోహిత్ శర్మ, అంజిక్య రహానే కారణంగా నలుగురు బౌలర్లతో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. నలుగురు బౌలర్లతో బరిలోకి దిగితే.. టెస్టు స్పెషలిస్టు రవిచంద్రన్ అశ్విన్ ఆడే అవకాశాలు ఉన్నాయి. రవీంద్ర జడేజా జట్టులో ఉండడం అనుమానమే. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ పేస్ బౌలింగ్‌ను ముందుండి నడిపించనున్నారు. వీరికి ఇషాంత్ శర్మ అండగా ఉంటాడు. ఉమేశ్ యాదవ్ బెంచ్‌కు పరిమితమవ్వొచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications