For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

26 ఏళ్ల పాకిస్థాన్‌ క్రికెటర్‌ రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

India Vs West Indies: Virat Kohli 19 runs away from breaking Javed Miandad’s 26-year-old record

ట్రినిడాడ్‌: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. వెస్టిండీస్‌పై వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును నమోదు చేసేందుకు 19 పరుగుల దూరంలో కోహ్లీ ఉన్నాడు. విండీస్‌తో ఆదివారం రాత్రి పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లోని క్వీన్స్‌పార్క్‌ ఓవల్‌ మైదానంలో జరుగనున్న రెండో వన్డేలో కోహ్లీ కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.

మరో 19 పరుగులు:

మరో 19 పరుగులు:

వన్డే ఫార్మాట్‌లో వెస్టిండీస్‌పై అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ (1912) ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్‌ దిగ్గజ ఆటగాడు జావెద్‌ మియాందాద్‌ (1930) పరుగులతో కోహ్లీ కంటే ముందున్నాడు. జావెద్‌ 26 ఏళ్లుగా ఈ జాబితాలో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో వన్డేలో కోహ్లీ మరో 19 పరుగులు చేస్తే మియాందాద్‌ను వెనక్కి నెట్టి తొలి స్థానంలోకి దూసుకొస్తాడు. మార్క్‌ వా (ఆస్ట్రేలియా ) 45 ఇన్నింగ్స్‌లో 1708 పరుగులు, జాక్వెస్‌ కలీస్‌ (దక్షిణాఫ్రికా) 40 ఇన్నింగ్స్‌లో 1666, రమీజ్‌ రాజా (పాకిస్థాన్) 53 ఇన్నింగ్స్‌లో 1624 పరుగులతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

34 ఇన్నింగ్స్‌లోనే?:

34 ఇన్నింగ్స్‌లోనే?:

జావేద్‌ మియాందాద్‌ 1930 పరుగుల్ని చేయడానికి 64 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. అయితే రెండో వన్డేలో కోహ్లీ 19 పరుగులు చేస్తే.. 34 ఇన్నింగ్స్‌లోనే జావేద్‌ను అధిగమిస్తాడు. ఇప్పటివరకూ విండీస్‌పై వన్డే ఫార్మాట్‌లో కోహ్లీ 7 సెంచరీలు, 10 హాఫ్‌ సెంచరీలు చేశాడు. మరోవైపు మియాందాద్‌ కేవలం ఒక్క సెంచరీ మాత్రమే చేసి.. 12 అర్థ శతకాలు నమోదు చేశాడు. 1993లో మియాందాద్‌ తన చివరి వన్డేలో ఈ ఫీట్‌ సాధించాడు.

వర్షం ముప్పు:

వర్షం ముప్పు:

విండీస్‌తో టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ రోజు రాత్రి క్వీన్స్‌ ఓవల్‌ పార్క్‌లో రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆటకు వరణుడు అడ్డుతగలకుంటే.. 'రన్ మెషిన్' విరాట్ కోహ్లీ ఈ సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశముంది.

అజయ్ ఠాకూర్ విజృంభణ.. గుజరాత్‌పై తలైవాస్ విజయం

గేల్‌ @ 300

గేల్‌ @ 300

విండీస్‌ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌ గేల్‌కి ఈ మ్యాచ్‌ 300వ వన్డే. దీంతో 300 వన్డేలు ఆడిన 21వ ఆటగాడిగా గేల్‌ రికార్డుల్లోకెక్కనున్నాడు. మరో 9 పరుగులు చేస్తే వన్డేల్లో లారా (10,405) అత్యధిక పరుగుల రికార్డును దాటనున్నాడు. గేల్‌ ప్రస్తుతం 10,397 పరుగులతో ఉన్నాడు. వన్డే సిరీస్‌ తర్వాత భారత్‌తో టెస్టుల్లోనూ ఆడి అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని ఆశించిన గేల్‌కు నిరాశ ఎదురైంది. సెలక్టర్లు అతడికి టెస్టు జట్టులో అవకాశమివ్వలేదు. దీంతో ఇంకో రెండు వన్డేలతో క్రిస్‌ కెరీర్‌ ముగియనుంది. గేల్‌ తొలి వన్డేలో 31 బంతుల్లో 4 పరుగులే చేసి ఔట్ అయిన విషయం తెలిసిందే.

Story first published: Sunday, August 11, 2019, 12:29 [IST]
Other articles published on Aug 11, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+