వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. పిచ్‌పై టర్న్ లభించే అవకాశం ఉందని, నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ కష్టమవుతుందని భావించే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నానని స్పష్టం చేశాడు.
'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. పిచ్ బాగుంది. కొంచెం తేమ కూడా ఉండనుంది. ఇది టెస్ట్ క్రికెట్, తొలి రెండు గంటలు జాగ్రత్తగా ఆడటం ముఖ్యం. ఇది యువ జట్టు. మేం మంచి క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాం. ఈ వికెట్‌పై టర్న్ లభిస్తుందని తెలుసు. నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం కష్టం. అందుకే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాం. ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లు, ఓ ఆల్‌రౌండర్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని రోస్టన్ ఛేజ్ తెలిపాడు.

మరోవైపు టాస్ ఓడినందుకు తమకు ఎలాంటి నిరాశ లేదని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా సొంతగడ్డపై జరిగే నాలుగు టెస్ట్‌లకు నాలుగు గెలవాలనుకుంటున్నామని చెప్పాడు. ఈ సిరీస్ కోసం బాగా సన్నదమయ్యామని, జట్టులో అందరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారని తెలిపాడు. టీ20 ఫార్మాట్ నుంచి రెడ్ బాల్ ఫార్మాట్‌కు మారడం కాస్త కష్టమేనని, కానీ తాము ఇందుకు మానసికంగా సిద్దమయ్యామని చెప్పాడు.
ఈ పిచ్ కవర్ల కింద ఉందని, ఆరంభంలో బౌలింగ్‌కు సహకరించే అవకాశం ఉందన్నాడు. ఇద్దరు పేసర్లు బుమ్రా, సిరాజ్‌తో పాటు ముగ్గురు స్పిన్నర్లు జడేజా, వాషింగ్టన్, కుల్దీప్ యాదవ్‌లతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డిని ఎంచుకున్నామని, సరైన కాంబినేషన్ కోసమే అతన్ని తీసుకున్నామని తెలిపాడు.
తుది జట్లు:
భారత్ : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(సి), ధ్రువ్ జురెల్(కీ), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
వెస్టిండీస్: టేగనరైన్ చందర్‌పాల్, జాన్ క్యాంప్‌బెల్, అలిక్ అతానాజ్, బ్రాండన్ కింగ్, షై హోప్(కీ), రోస్టన్ ఛేజ్(సి), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖారీ పియర్, జోహన్ లేన్, జేడెన్ సీల్స్.