Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: గాయంపై రోహిత్ శర్మ ఏమన్నాడంటే..?

India vs West Indies: Rohit Sharma provides update on his injury after retiring hurt while batting

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో హిట్‌మ్యాన్ అనూహ్యంగా గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. భారీ సిక్సర్‌తో పాటు బౌండరీ బాదిన హిట్ మ్యాన్ అంతలోనే గాయపడి మైదానం వీడటం అభిమానులకు నిరాశ కలిగించింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినా.. ఫ్యాన్స్‌కు ఆ సంతోషం కూడా లేకుండా పోయింది. వెస్టిండీస్‌తో టీ20 పోతేపోనీ కానీ.. ముందున్న ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ టోర్నీలకు రోహిత్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి.

 ఇప్పుడైతే బాగానే ఉంది..

ఇప్పుడైతే బాగానే ఉంది..

ఇక ఈ విజయానంతరం మాట్లాడిన రోహిత్ శర్మ తన గాయంపై స్పందించాడు. గాయం నుంచి కోలుకుని వచ్చే మ్యాచ్‌ ఆడతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు. 'ఇప్పుడైతే బాగానే ఉంది. తదుపరి మ్యాచ్‌కు(ఆగస్ట్‌ 6) ఇంకా సమయం ఉంది.. కాబట్టి ఆలోపు గాయం నుంచి కోలుకుంటానని భావిస్తున్నా. ఇక ఇవాళ్టి మ్యాచ్‌ గెలవడం సంతోషంగా ఉంది. కీలకమైన మధ్య ఓవర్లలో బౌలింగ్‌ చేయడం ఎప్పుడూ సవాలే. అయితే పిచ్‌ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని మా బౌలర్లు విభిన్నంగా బౌలింగ్‌ వేశారు.

రిస్క్ షాట్లు ఆడకుండా..

రిస్క్ షాట్లు ఆడకుండా..

చేజింగ్‌లోనూ సానుకూల దృక్పథంతో ఆడాం. ఎక్కడా రిస్క్‌ తీసుకున్నట్లు నాకైతే అనిపించలేదు. చాలా ప్రశాంతంగా బ్యాటర్లు లక్ష్యాన్ని అధిగమించారు. సూర్య అద్భుతంగా ఆడాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించాడు. ఇక్కడ టార్గెట్‌ను ఛేదించడం అంత సులువేం కాదు. అందుకే.. ఎలాంటి రిస్క్‌కు పోకుండా పరుగులు రాబట్టాం'' అని రోహిత్ వివరించాడు. రోహిత్ గాయంపై బీసీసీఐ ట్విటర్‌ వేదికగా స్పందించింది. 'రోహిత్‌కు నడుం కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. వైద్యబృందం నిశితంగా పరిశీలిస్తోంది'' అని ట్వీట్ చేసింది.

భారత్‌దే విజయం..

భారత్‌దే విజయం..

ఈ మూడో టీ20లో భారత్ ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. దాంతో సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. సూర్యకుమార్‌ యాదవ్ (76), శ్రేయస్‌ అయ్యర్ (27), రిషభ్ పంత్ (33*) రాణించారు. కెప్టెన్‌ రోహిత్ శర్మ (5 బంతుల్లో 11 రిటైర్‌హర్ట్‌: ఒక సిక్స్‌, ఒక ఫోర్‌) దూకుడుగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించినా నడుం వద్ద కండరాలు పట్టేయడంతో మైదానం వదిలి పెట్టాల్సి వచ్చింది.

Story first published: Wednesday, August 3, 2022, 15:31 [IST]
Other articles published on Aug 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+