న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అనుమానాలన్నింటినీ ఎగరగొట్టిన అంబటి రాయుడు

India Vs West Indies 2018,4th ODI :Dhoni Falls A Run Short To Enter 10k ODI Club For India| Oneindia
India vs West Indies: Rohit Sharma backs Ambati Rayudu at No. 4

హైదరాబాద్: మూడో వన్డేను పేలవంగా ముగించిన టీమిండియా నాల్గో వన్డేలో పట్టుదలతో ఆడింది. అంతకుముందు రోజు తీవ్రంగా నెట్స్‌లో ప్రాక్టీసు చేసిన కోహ్లీసేన దాని ప్రభావాన్ని బ్రబౌర్న్ వేదికగా రెచ్చిపోయి చూపించింది. పుణేలోని బ్రాబౌర్న్ స్టేడియంలో సోమవారం వెస్టిండీస్‌తో జరిగి మ్యాచ్‌లో రోహిత్ శర్మ (162), అంబటి రాయుడు (100) సెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 211 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

రాయుడు బ్యాటింగ్‌‌ను ప్రశంసించిన రోహిత్

మ్యాచ్ విజయంలో వీరి భాగస్వామ్యం కీలక పాత్ర పోషించింది. కొంతకాలంగా విపరీతంగా చర్చకు కారణమైన నాలుగో స్థానంలో వచ్చిన అంబటి రాయుడు.. రోహిత్ శర్మకు మంచి సహకారం అందించాడు. మొదట క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించిన రాయుడు.. హాఫ్ సెంచరీ తరవాత చెలరేగిపోయాడు. రాయుడు బ్యాటింగ్‌‌ను వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసించాడు. రాయుడికి అండగా నిలిచాడు.

కోహ్లీ.. బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ సూపరే!!

నం.4పై ఉన్న అనుమానాలన్నింటినీ:

నం.4పై ఉన్న అనుమానాలన్నింటినీ:

ప్రపంచ కప్ వరకు ఇక ఎవరూ నాలుగో స్థానం గురించి మాట్లాడరని అనుకుంటున్నా. నం.4పై ఉన్న అనుమానాలన్నింటినీ రాయుడు తొలగించాడు. ఒత్తిడిలో అతను ఆడిన తీరు అద్భుతం. అతను మొదట నాతో భాగస్వామ్యాన్ని ఏర్పరిచాడు. 50 పరుగులు పూర్తిచేసిన తరవాత షాట్స్ ఆడటం మొదలుపెట్టాడు. రాయుడు సామర్థ్యం గురించి మనకు ఎప్పటి నుంచో తెలుసు. సోమవారం ఆడిన ఇన్నింగ్స్ లాంటివి రాయుడు ఎన్నో ఆడగలడని మనందరికీ తెలుసు.

యో-యోలో ఫెయిలవడంతో పర్యటనకు వెళ్లలేక

యో-యోలో ఫెయిలవడంతో పర్యటనకు వెళ్లలేక

ఇంగ్లండ్ పర్యటనకు మొదట ఎంపికైన రాయుడు.. ఆ తరవాత యో-యో టెస్టులో ఫెయిలవడం కారణంగా పర్యటనకు వెళ్లలేకపోయాడు. దీనిపై రోహిత్ మాట్లాడుతూ.. ‘దీనిలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. నువ్వు టెస్టులో పాస్ అయితే ఆడొచ్చు. కానీ అతను ఆ టెస్టులో విఫలమయ్యాడు. అందుకే ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లలేకపోయాడు' అని చెప్పుకొచ్చాడు.

సత్తా నిరూపించుకున్న రాజస్థాన్ పేసర్

సత్తా నిరూపించుకున్న రాజస్థాన్ పేసర్

అలాగే ఎడమచేతి వాటం సీమర్ ఖలీల్ అహ్మద్‌పై కూడా రోహిత్ ప్రశంసలు కురిపించాడు. యూఏఈలో జరిగిన ఆసియా కప్‌లో ఈ రాజస్థాన్ పేసర్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడని, అందుకే ఈ సిరీస్‌కు ఎంపికయ్యాడని చెప్పాడు.

Story first published: Tuesday, October 30, 2018, 11:34 [IST]
Other articles published on Oct 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X