
వ్యూయర్‌షిప్ ఢమాల్..
టీ20 తరహాలో సస్సెన్స్ థ్రిల్లర్‌లను తలపించిన ఈ రెండు మ్యాచ్‌లకు పెద్దగా ప్రేక్షకాదరణ లభించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడంతో ఈ సిరీస్‌ను జనాలు లైట్ తీసుకున్నారు. దాంతోనే గత సిరీస్‌లు మాదిరిగా.. ఈ పర్యటనలో భారత్ గెలిచినా పెద్దగా చర్చ జరగడం లేదు. అసలు చాలా మందికి ఈ సిరీస్ జరుగుతుందనే విషయమే తెలియదు. ఈ సిరీస్‌కు ప్రేక్షక ఆదరణ లభించకపోవడానికి సీనియర్ ప్లేయర్లు లేకపోవడం ప్రధాన కారణమైతే మరో కారణం వెస్టిండీస్ టైమింగ్స్.

టైమింగ్స్ అనుకూలంగా లేకపోవడం..
రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతున్న మ్యాచ్ మళ్లీ వేకువజామున 3 గంటలకు ముగుస్తోంది. ఈ టైమింగ్స్‌తో భారత అభిమానులు మ్యాచ్‌లు చూడలేకపోతున్నారు. పడుకునేసరికి మ్యాచ్ ముగియకపోవడం.. లేచేసరికి రిజల్ట్ వస్తుండటంతో ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌ల మజాను అభిమానులు ఎంజాయ్ చేయలేకపోయారు. ఓటీటీ హక్కులు కూడా ఫ్యాన్ కోడ్ దగ్గర ఉండటం.. దాని సబ్‌స్క్రిప్షన్ ఎవరి దగ్గర ఎక్కువ లేకపోవడం కూడా వ్యూయర్ షిప్ రాకపోవడానికి కారణమైంది. డీడీ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్‌లు ప్రసారం జరుగుతుండగా ఈ విషయం ఎవరికీ తెలియకపోవడం కూడా వ్యూయర్‌షిప్‌పై ప్రభావం చూపింది.

టీ20 సిరీస్‌తో..
స్టార్ స్పోర్ట్స్, సోనీ చానెల్స్ తమ మ్యాచ్‌ల వివరాలను ఎక్కువగా క్యాంపైన్ చేస్తుంటాయి. ఆయా చానెల్స్‌కు రీజినల్ కామెంట్రీ కూడా అందుబాటులో ఉండటం, డీడీ స్పోర్ట్స్ కేవలం హిందీ వ్యాఖ్యానం రావడం కూడా వ్యూయర్ షిప్‌పై ప్రభావం చూపింది. అయితే టీ20 సిరీస్ వరకు ఈ పరిస్థితి మారే అవకాశం ఉంది. రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు టీ20 సిరీస్‌కు అందుబాటులోకి రావడం మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవడం వంటి అంశాలతో వ్యూయర్‌షిప్ పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications
