For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండీస్‌తో నేడు తొలి వన్డే.. సైనీకి అరంగేట్రం చాన్స్‌!!

India vs West Indies 2019, 1st ODI : Match Preview || Oneindia Telugu
India Vs West Indies: Probable India XI for 1st ODI in Guyana, Navdeep Saini set to make it big for India

గయానా: టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా ఇక వన్డే సమరానికి సిద్దమయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం ప్రావిడెన్స్‌ మైదానంలో వెస్టిండీస్‌, భారత్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. టీ20ల్లో కోహ్లీసేన ముందు నిలవలేకపోయిన విండీస్‌.. వన్డేల్లో ఏమాత్రం పోటీ ఇస్తుందో చూడాలి. మిడిల్‌ఆర్డర్‌ సమస్యకు పరిష్కారం కోసం కొత్త ఆటగాళ్లను ప్రయోగించేందుకు టీమిండియా సిద్ధమైంది. సీనియర్ ఎంఎస్ ధోనీ గైర్హాజరీలో ప్రధాన కీపర్‌గా రిషభ్‌ పంత్‌ ఏ మేరకు రాణిస్తాడన్నది స్పష్టం కానుంది. యువపేసర్లు నవదీప్ సైనీ, ఖలీల్‌ అహ్మద్ ప్రతిభకు ఈ సిరీస్‌ పరీక్ష కానుంది. టీ20ల మాదిరే వన్డే సిరీస్‌ సైతం భారత కుర్రాళ్లు ప్రతిభ చాటుకోవడానికి మరో మంచి అవకాశం.

భారత్‌కు ఎదురుండకపోవచ్చు:

భారత్‌కు ఎదురుండకపోవచ్చు:

వన్డేల్లో వెస్టిండీస్‌ గత కొన్నేళ్ల ప్రదర్శన మరీ పేలవంగా ఉంది. టీ20లకు అలవాటు పడిన ఆ జట్టు ఆటగాళ్లు 50 ఓవర్ల ఫార్మాట్ ఆటలో క్రీజులో నిలవలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు సిరీస్‌లో ఎదురుండకపోవచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే విండీస్ జట్టులో విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్‌, హెట్‌మైర్, పూరన్, హోల్డర్‌ వంటి ఆటగాళ్లున్న నేపథ్యంలో భారత్‌ ఉదాసీనంగా ఉంటే మూల్యం చెల్లించుకోవాల్సిందే.

పాండే, అయ్యర్‌లలో ఒక్కరే:

పాండే, అయ్యర్‌లలో ఒక్కరే:

ప్రపంచ కప్‌ నుంచి గాయంతో వైదొలగిన శిఖర్ ధావన్‌ టీ20 సిరీస్‌లో విఫలమయ్యాడు. అయితే వన్డేల్లో ఎలా ఆడతాడో చూడాలి. రోహిత్ శర్మ, కెప్టెన్‌ విరాట్ కోహ్లీలు ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. నాలుగో స్థానంలో కేఎల్‌ రాహుల్‌కే అవకాశం దక్కొచ్చు. ప్రపంచకప్‌లో ప్రభావం చూపలేకపోయిన కేదార్ జాదవ్ తుది జట్టులో ఉండే అవకాశాలు తక్కువ. మిడిల్‌ ఆర్డర్‌లో మనీశ్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌ల్లో ఒకరికి ఛాన్స్‌ దక్కే అవకాశం ఉంది. టీ20లో పాండే నిరాశపరచడంతో అయ్యర్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వికెట్‌ కీపింగ్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ను పరిస్థితులకు తగ్గట్టు 5 లేదా 6స్థానాల్లో బ్యాటింగ్‌కు పంపవచ్చు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా జడేజా ఖాయం.

 సైనీ అరంగేట్రం:

సైనీ అరంగేట్రం:

ప్రపంచకప్‌లో రాణించకపోవడంతో టీ20 సిరీస్‌కు మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్, చహల్‌లను పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో విండీస్‌తో వన్డే సిరీస్‌ వీరికి సవాల్‌తో కూడుకున్నది. జడేజా ఉంటాడు కాబట్టి ఒక్కరికే అవకాశం దక్కొచ్చు. సీనియర్లు భువనేశ్వర్, షమీలు పేస్ భాద్యతలు మోయనున్నారు. టీ20 సిరీస్‌లో అదరగొట్టిన యువ పేసర్‌ నవ్‌దీప్‌ సైనీ ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే భువనేశ్వర్, షమీలలో ఒకరిని తప్పించి ఖలీల్‌ అహ్మద్‌కు అవకాశమిస్తారా అన్నది ఆసక్తికరం.

పర్దీప్‌ నర్వాల్‌ మెరిసినా పట్నాకు తప్పని ఓటమి

జట్టులోకి గేల్‌:

జట్టులోకి గేల్‌:

టీ20 సిరీస్‌ పరాభవానికి వన్డేల్లో చెలరేగి బదులు తీర్చుకోవాలని విండీస్‌ ప్రణాళికలు రచిస్తున్నది. క్రిస్‌ గేల్‌ జట్టులోకి రానుండడం కరీబియన్‌ జట్టుకు కొండంత బలం. హెట్‌మైర్‌, పూరన్‌ లాంటి ఆటగాళ్లతో ఆ జట్టు బలంగా కనిపిస్తున్నది. నిలకడగా ఆడే షై హోప్, రోస్టన్‌ చేజ్‌లు అండగా ఉండనున్నారు. వన్డే జట్టు కెప్టెన్‌ హోల్డర్‌ అయినా విండీస్‌ను గెలుపు బాటలో నడిపిస్తాడేమో చూడాలి. కాట్రెల్‌, థామస్‌, కీమర్‌ రోచ్‌లతో కూడిన విండీస్‌ పేస్‌ దళం పటిష్టంగానే కనిపిస్తోంది.

చిరుజల్లులు పడే అవకాశం:

చిరుజల్లులు పడే అవకాశం:

భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఇప్పటివరకు 127 వన్డేలు జరిగాయి. 60 మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం ఆడించగా.. 62 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌ గెలిచింది. రెండు మ్యాచ్‌లు ‘టై'గా ముగిశాయి. మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. వెస్టిండీస్‌ గడ్డపై ఆ జట్టుతో భారత్‌ ఇప్పటివరకు 36 మ్యాచ్‌లు ఆడింది. 14 మ్యాచ్‌ల్లో గెలిచి, 20 మ్యాచ్‌ల్లో ఓడింది. రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. 2017లో విండీస్‌లో పర్యటించిన భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో గెల్చుకుంది. ఉదయం చిరుజల్లులు పడే అవకాశముంది. మ్యాచ్‌ జరిగే కొద్ది పిచ్‌ స్లోగా మారుతుంది.

జట్ల అంచనా:

జట్ల అంచనా:

భారత్‌: రోహిత్‌ శర్మ, శిఖర్ ధవన్‌, విరాట్ కోహ్లీ( కెప్టెన్‌), కేఎల్ రాహుల్‌, మనీశ్‌ పాండే/శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్, మొహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, కుల్దీప్‌ యాదవ్‌ / చాహల్‌.

వెస్టిండీస్‌: గేల్‌, లెవిస్‌/క్యాంప్‌బెల్‌, షాయి హోప్‌, హిట్‌మెయిర్‌, పూరన్‌, రోస్టన్‌ చేస్‌, కీమో పాల్‌, హోల్డర్‌ (కెప్టెన్‌), కీమర్‌ రోచ్‌, ఒషానే థామస్‌, కాట్రెల్‌.

Story first published: Thursday, August 8, 2019, 10:10 [IST]
Other articles published on Aug 8, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+