న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండీస్‌తో భారత్ రెండో వన్డే.. వరుణుడు కరుణిస్తేనే మ్యాచ్‌

India Vs West Indies: Predicted XI for 2nd ODI, Preview, Debut expected, All eyes in Shreyas Iyer

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ప్రావిడెన్స్‌లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దయినా.. టీమిండియాదే పైచేయి. అదే ఉత్సాహంతో టీమిండియా ఆదివారం రాత్రి పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లోని క్వీన్స్‌పార్క్‌ ఓవల్‌ మైదానంలో జరిగే రెండో వన్డేలో వెస్టిండీస్‌తో తలపడనుంది. ఇరు జట్లు దాదాపు మార్పుల్లేకుండానే బరిలో దిగే సూచనలు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించొచ్చని సమాచారం. తొలి వన్డే తుది జట్టులో చోటు దక్కించుకున్న శ్రేయస్‌ అయ్యర్‌.. రెండో వన్డేలో అయినా బ్యాటింగ్‌ చేసే అవకాశం వస్తుందో చూడాలి. ఇక విండీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌కు ఇది 300వ వన్డే కావడం విశేషం.

<strong>అజయ్ ఠాకూర్ విజృంభణ.. గుజరాత్‌పై తలైవాస్ విజయం</strong>అజయ్ ఠాకూర్ విజృంభణ.. గుజరాత్‌పై తలైవాస్ విజయం

అయ్యర్‌ మీదే ఆశలు:

అయ్యర్‌ మీదే ఆశలు:

ప్రపంచకప్‌ నుంచి గాయంతో వైదొలగిన శిఖర్ ధావన్‌ టీ20 సిరీస్‌లో విఫలమయ్యాడు. కనీసం వన్డేల్లో అయినా సత్తా చాటాలని కోహ్లీ బావిస్తున్నాడు. రోహిత్ శర్మ, కెప్టెన్‌ విరాట్ కోహ్లీలు ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. నాలుగో స్థానం విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఆ స్థానంలో ఎవ్వరూ కుదురుకోవట్లేదు. యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ను ఆ స్థానంలో పరీక్షించబోతున్నారు. అయ్యర్‌ తొలి వన్డేలో అవకాశం దక్కించుకున్నా.. ఆ మ్యాచ్‌ రద్దవడంతో అతడికి బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. రెండో వన్డేలో అవకాశం వస్తే ఏమేరకు రాణిస్తాడో చూడాలి. రిషబ్ పంత్, జాదవ్ మిడిల్ భారాన్ని మోయనున్నారు.

ఖలీలా.. సైనీయా:

ఖలీలా.. సైనీయా:

భువనేశ్వర్‌ కుమార్, మొహ్మద్ షమీలు పేస్ బాధ్యతల్ని మోయనున్నారు. ఇక యువ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ను ఆడించాలా? లేదా? అనేది టీమిండియాకు సందిగ్ధత. తొలి వన్డేలో విండీస్‌ ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌కు పదేపదే లెగ్‌సైడ్‌ బంతులు వేసి ధారాళంగా పరుగులు ఇచ్చాడు. ఖలీల్‌ను తప్పిస్తే నవదీప్‌ సైనీకి అరంగేట్రం అవకాశం దక్కొచ్చు. స్పిన్ విభాగంలో జడేజా, కుల్‌దీప్‌లను కొనసాగిచే అవకాశం ఉంది. పిచ్‌ అనుకూలిస్తుందని భావిస్తే చహల్‌ను తీసుకునే వీలుంది.

గేల్‌ సత్తా చేటేనా:

గేల్‌ సత్తా చేటేనా:

ఓపెనర్‌ లూయిస్‌ పరుగులు సాధించడం విండీస్‌కు పెద్ద సానుకూలాంశం. అయితే గేల్‌ ఫామ్‌ ఆందోళన పరుస్తోంది. తొలి వన్డేలో దారుణంగా విగలమయిన గేల్.. మెరుపులు మెరిపించి కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని జట్టు భావిస్తోంది. హోప్, పూరన్, హెట్‌మైర్, చేజ్‌ రూపంలో విండీస్‌కు నాణ్యమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. లోయరార్డర్‌లో కెప్టెన్‌ హోల్డర్, బ్రాత్‌వైట్‌ రాణించగలరు. రోచ్, కాట్రెల్‌కు తోడు ఇద్దరూ బౌలింగ్‌లో కూడా బాధ్యతలు తీసుకోనున్నారు.

బీసీసీఐ నిర్ణయాన్ని స్వాగతించిన కేంద్ర క్రీడల మంత్రి

పిచ్, వాతావరణం

పిచ్, వాతావరణం

క్వీన్స్‌పార్క్‌ ఓవల్‌ మైదానం స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉంది. ఈ మైదానంలో 2010 నుంచి స్పిన్నర్ల సగటు 27.40 కాగా.. పేసర్ల సగటు 32.12. అయితే ఇక్కడ చివరి ఐదు వన్డేల్లో నాలుగు వర్షం ప్రభావానికి గురయ్యాయి. నేటి మ్యాచ్‌కు మాత్రం వర్షం ముప్పు లేదని సమాచారం. ఈ రోజు పాక్షికంగా మేఘావృతమై.. 25 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వాతావరణం ఉండనుంది.

జట్లు అంచనా:

జట్లు అంచనా:

భారత్: కోహ్లీ(కెప్టెన్), రోహిత్, ధవన్, శ్రేయస్ అయ్యర్, కేదార్, పంత్ (వికెట్ కీపర్), జడేజా, భువనేశ్వర్, షమీ, ఖలీల్ అహ్మద్, కుల్దీప్.

వెస్టిండీస్: హోల్డర్ (కెప్టెన్), క్రిస్ గేల్, ఎవిన్ లూయి స్, హోప్ (వికెట్ కీపర్), హెట్‌మైర్, పూరన్, చేస్, అలెన్, బ్రాత్‌వైట్, కీమర్ రోచ్, కాట్రెల్.

Story first published: Sunday, August 11, 2019, 10:50 [IST]
Other articles published on Aug 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X