India vs West Indies వన్డే సిరీస్.. డీడీ స్పోర్ట్స్ కండోమ్ యాడ్స్‌పై ఫ్యాన్స్ ఫైర్!

న్యూఢిల్లీ: వెస్టిండీస్ గడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. అయితే ఈ పర్యటనలోని మ్యాచ్‌లను భారత ప్రభుత్వానికి చెందిన దూరదర్శన్ ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం.. రాత్రి 7గంటలకు ప్రారంభమై వేకువజామున 3.30కు ముగుస్తాయి. దాంతో ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ చానెళ్లు అయిన స్టార్, సోనీ నెట్‌వర్క్‌లు ఈ మ్యాచ్ ప్రసార హక్కుల కోసం పోటీపడలేదు. భారత కాలమానానికి విరుద్దంగా ఈ మ్యాచ్‌ల టైమింగ్స్ ఉండటంతో కమర్షియల్‌గా తమకు వచ్చే లాభం ఏం లేదని భావించిన ఈ చానెళ్లు ఈ పర్యటనకు దూరంగా ఉన్నాయి.
ఫ్యాన్ కోడ్‌కు డిజిటల్ రైట్స్..
దాంతో డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్ కోడ్ తక్కువ ధరకే దక్కించుకుంది. ఈ యాప్ సబ్‌స్క్రీప్షన్ తీసుకొని యాప్, వెబ్ ఆధారంగా మ్యాచ్‌లను చూడవచ్చు.టెలివిజన్ హక్కుల కోసం ఏ ఛానెల్ బిడ్డింగ్ వేయకపోవడంతో భారత క్రీడా మంత్రిత్వ శాఖ, ప్రసార శాఖ ఉమ్మడి ఆధ్వర్యంలో నడిచే దూరదర్శన్ ఛానల్ ఆపన్న హస్తం అందించింది. కోట్లాది మంది భారత అభిమానులను నిరాశపర్చకుండా టీవీల్లో ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. దాంతో అభిమానులంతా సంతోషం వ్యక్తం చేశారు. అప్పుడెప్పుడో దూరదర్శన్ చానెల్‌లో మ్యాచ్‌లు చూశామని, 1990కి చెందిన చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు.
దూరదర్శన్‌కు టీవీ రైట్స్..
ఒకప్పుడు మ్యాచ్‌లు తప్పకుండా దూరదర్శన్ ఛానల్లో ప్రసారమయ్యేవి. క్రమంగా ప్రైవేటు ఛానళ్ల ఆధిక్యత పెరిగాక డీడీ స్పోర్ట్స్ ఛానల్ హవా తగ్గింది. ఇక గత 15, 20ఏళ్లుగా డీడీ స్పోర్ట్స్ ఛానల్లో మ్యాచ్‌ల ప్రసారాలు బాగా తగ్గిపోయాయి. ప్రైవేటు ఛానళ్లు తామంటే తాము అంటూ కొట్టుకుచచ్చి ఆటను పూర్తిగా కమర్షియల్‌గా మార్చేశాయి. దాంతో మ్యాచ్‌ల ప్రసారాలకు డీడీ స్పోర్ట్స్ దూరమైంది. మళ్లీ ఇన్నాళ్లకు కమర్షియల్ హక్కులు అందుకోవడం అభిమానులకు సంతోషాన్నిచ్చింది.
కండోమ్ యాడ్స్‌తో..
అయితే ఇప్పడు డీడీ స్పోర్ట్స్ మ్యాచ్ మధ్యలో కండోమ్ యాడ్స్ ఇస్తుందని, ఇది చాలా ఇబ్బందిగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. డ్యురెక్స్ కండోమ్ యాడ్స్‌తో చంపేస్తుందని, ఫ్యామిలీతో కలిసి మ్యాచ్‌లు చూడలేకపోతున్నామని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ యాడ్స్ కారణంగా ఇంట్లోవారికి ముఖం చూపించుకోలేకపోతున్నామని, డీడీ చానెల్ కండోమ్ యాడ్స్ తప్పా ఇంకేం ఇవ్వదా? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications