Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దటీజ్ ధోనీ.. 0.08 సెకన్లలో స్టంపౌట్(వీడియో)

India Vs West Indies 2018,4th ODI : Dhoni Takes 0.08 Second To Effect Stumping | Oneindia Telugu
India vs West Indies: MS Dhoni stumps Keemo Paul, Ravindra Jadeja taken by surprise

హైదరాబాద్: వికెట్ల వెనుక చురుకుగా స్పందించేది ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. అతని స్థానాన్ని భర్తీ చేయాలని ఆటగాళ్ల కోసం బీసీసీఐ వేటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ధోనీ మరోసారి తన స్టైల్‌ను చూపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. క్రీజు బయటికి వెళ్లిన బ్యాట్స్‌మన్ స్పందించేలోపే ధోనీ వికెట్లను గిరాటేశాడు.

జడేజా విసిరిన ఐదో బంతిని..

జడేజా విసిరిన ఐదో బంతిని..

ఆ తర్వాత ఔట్ అని డిక్లేర్ చేస్తూ.. ముందుకొచ్చేశాడు. ఆ విషయం బౌలింగ్ వేస్తున్న రవీంద్ర జడేజాకు కూడా అర్థం కాలేదు. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్ చేస్తున్న 28వ ఓవర్ అది. క్రీజులో కీమో పాల్ ఉన్నాడు. ఆ ఓవర్‌లోని జడేజా విసిరిన ఐదో బంతిని పాల్ డిఫెన్స్ ఆడేందుకు యత్నించాడు. అయితే బంతి పాల్ బ్యాట్‌ను తప్పించుకుని ధోనీ చేతిలో పడింది.

ఆ రికార్డుకు ఒక్క పరుగు దూరంలో ధోనీ..

ఆశ్చర్యకరంగా 0.08 సెకన్లలో స్టంపౌట్

కనురెప్పపాటులో స్పందించిన ధోనీ వికెట్లను గిరాటేశాడు. ఆ సమయంలో కీమో పాల్ కాలు క్రీజు బయటికి వచ్చింది. అతను స్పందించేలోపే ధోనీ తనపని కానిచ్చాడు. కేవలం 0.08 సెకన్లలో స్టంపౌట్ చేసి ఆశ్చర్యపరిచాడు. ధోనీ స్టంప్ చేయగానే ఔటా..? అన్నట్లు బౌలర్ జడేజా చాలా ఆశ్చర్యంగా చూశాడు.

అప్పీల్‌ను పరిశీలించిన టీవీ అంపైర్..

అప్పీల్‌ను పరిశీలించిన టీవీ అంపైర్..

ఆ అయిపోయింది అది అవుటే అన్నట్టు చిరునవ్వుతో ధోనీ సమాధానం ఇచ్చాడు. ఈ స్టంప్ అప్పీల్‌ను పరిశీలించిన టీవీ అంపైర్ ఔట్‌గా నిర్ణయించారు. దీంతో విండీస్ బ్యాట్స్‌మన్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. కాగా, ఆ తర్వాత టీమిండియా ఆశ్చర్యాన్ని వీడి వికెట్ సంబరాలు చేసుకుంది.

ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో

ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో

కాగా, ఈ నాల్గో వన్డేలో 224 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై భారత్ గెలిచింది. మూడో వన్డేలో టీమిండియాపై గెలిచింది వెస్టిండీస్. ఆ ఒక్క మ్యాచ్ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని టీమిండియాపై గెలిచి ట్రోఫీ పట్టుకుపోతామంటూ వెస్టిండీస్ ఆటగాళ్లు చెప్పుకొచ్చారు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది.

Story first published: Tuesday, October 30, 2018, 12:27 [IST]
Other articles published on Oct 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+