
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 174 పరుగులు
సోమవారం వెస్టిండీస్‌తో ఆడిన నాల్గో వన్డేలో ధోనీ కెరీర్‌లో భారత్ తరపున 9999పరుగులు పూర్తి చేసుకున్నాడు. 2007లో ఆఫ్రికా ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసియా ఎలెవన్ తరపున ఆడిన ధోని ఆ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 174 పరుగులు సాధించాడు. ఇప్పటివరకూ ధోని వన్డే ఫార్మాట్‌లో చేసిన పరుగులు 10, 173 కాగా, భారత్ ఆటగాడిగా మాత్రం ఆ ఘనతను చేరుకోలేదు.
అనుమానాలన్నింటినీ ఎగరగొట్టిన అంబటి రాయుడు

పదివేలకు పరుగు దూరంలో
భారత్ తరపున పదివేల పరుగులు పూర్తి చేసేందుకు పరుగు దూరంలో నిలిచాడు ధోని. 2018వ సంవత్సరంలో ధోనీ 12 ఇన్నింగ్స్‌లో ఆడి 252 పరుగులు చేశాడు. కాగా గతంతో పోలిస్తే ప్రస్తుత స్ట్రైక్ రేట్ 68.10తో తక్కువగా ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.

చివరిదైన ఆఖరి వన్డేలో ధోనీకి అవకాశం
తిరువనంతపురంలో గురువారం జరుగనున్న చివరిదైన ఆఖరి వన్డేలో ధోని ఆ మార్కును చేరుకునే అవకాశం ఉంది. ఈ పేలవ ఫామ్ కారణంగానే అతనిని వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు, ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియాలో సెలక్టర్లు స్థానం కల్పించలేకపోయారు.

224 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుగా
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రోహిత్ శర్మ (162; 137 బంతుల్లో 20ఫోర్లు, 4సిక్సు), అంబటి రాయుడు (100; 81 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సు) సెంచరీలతో చెలరేగిన వేళ.. సోమవారం జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఏకంగా 224 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 377 పరుగుల భారీ స్కోరు చేసింది. ఖలీల్ అహ్మద్ (3/13), కుల్‌దీప్ (3/42) ధాటికి ఛేదనలో విండీస్ 36.2 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూలింది.


Click it and Unblock the Notifications













