తొలి టీ20: బాబర్ అజాం, కోహ్లీ రికార్డును కేఎల్ రాహుల్ బద్దలు కొట్టేనా?

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డుకి చేరువయ్యాడు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత వెస్టిండిస్ పర్యటనలో భాగంగా అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా తొలి టీ20కి సన్నద్ధమైంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా తొలి టీ20 ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ శనివారం జరగనుంది.
ఈ సిరిస్‌లో అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల్ని సాధించే అరుదైన అవకాశం కేఎల్ రాహుల్‌కి దక్కింది. టీ20ల్లో కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 879 పరుగులు చేశాడు. మరో 121 పరుగులు సాధిస్తే వెయ్యి పరుగులు సాధించిన ఏడో భారత క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ నిలుస్తాడు.

కేఎల్ రాహుల్ అరుదైన ఘనత
అలాగే వెస్టిండిస్‌తో శనివారం జరగనున్న తొలి టీ20లోనే ఈ పరుగులు సాధిస్తే అత్యంత వేగంగా ఈ పరుగులు చేసిన అంతర్జాతీయ క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టిస్తాడు. శనివారం వెస్టిండిస్‌తో జరగనున్న మ్యాచ్ కేఎల్ రాహుల్‌కు 25వ ఇన్నింగ్స్ కావడం విశేషం. ఈ క్రమంలో పాక్ క్రికెటర్ బాబర్ అజాం పేరిట ఉన్న రికార్డు బద్దలవుతుంది.
జో రూట్ లక్కీ: బంతి బెయిల్స్‌ను తాకినా కింద పడలేదు (వీడియో)

బాబర్ అజాం రికార్డు బద్దలయ్యేనా?
ఇప్పటివరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజాం 26 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(27 ఇన్నింగ్స్‌లు) రెండో స్థానంలో ఉండగా, అరోన్ ఫించ్(29 ఇన్నింగ్స్‌లు) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, కేఎల్ రాహుల్ విండిస్‌తో జరిగే తొలి టీ20లోనే 121 పరుగులు చేస్తేనే ఈ ఘనత సాధిస్తాడు.

విండిస్ పర్యటన నెల రోజులు పాటు
వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. విండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా వెస్టిండిస్‌తో నెల రోజుల పాటు సుదీర్ఘ సిరిస్‌లో తలపడనుంది. శనివారం, ఆదివారం రెండు టీ20 మ్యాచ్‌లు ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ ఆతిథ్యమిస్తోంది.
యాషెస్ తొలి టెస్టులోనే బర్న్స్ సెంచరీ: గత 100 టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఇది ఐదోది

మూడో టీ20 నుంచి వెస్టిండిస్‌లో
ఇక, ఆగస్టు 6న జరిగే మూడో టీ20 నుంచి సిరిస్ వెస్టిండిస్‌లో జరగనుంది. మూడో టీ20 గుయానాలో జరగనుంది. ఆ తర్వాత మూడు వన్డేలు, రెండు టెస్టు సిరిస్ జరగనుంది. విండిస్ పర్యటనకు సెలక్టర్లు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినివ్వగా.. ధోనీ రెండు నెలలుపాటు ఆర్మీకి సేవలందించడం కోసం క్రికెట్‌కు దూరమయ్యాడు. దీంతో పలువురు యువ క్రికెటర్లకు సెలక్టర్లు అవకాశమిచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications