వెస్టిండీస్‌తో తొలి టీ20: కేవలం 26 పరుగులే.. రాహుల్‌ను ఊరిస్తున్న ప్రపంచ రికార్డు!!

హైదరాబాద్: టీమిండియా-వెస్టిండీస్ జట్ల మధ్య రేపటి (శుక్రవారం) నుంచి మూడు టీ20ల సిరీస్ ఆరంభం కానుంది. శుక్రవారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌కు గాయం కారణంగా రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ దూరం అయిన నేపథ్యంలో టీమిండియా బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ ఓపెనర్ అవతారం ఎత్తనున్నాడు. ఈ తరుణంలో రాహుల్‌ను ఒక రికార్డు ఊరిస్తోంది.

కేవలం 26 పరుగులే:
కేఎల్ రాహుల్ టీ20 ఫార్మాట్‌లో మరో 26 పరుగులు చేస్తే.. టీమిండియా తరఫున వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఏడో బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. రాహుల్ ఇప్పటివరకు 31 మ్యాచ్‌ల్లో (28 ఇన్నింగ్స్) 41.34 సగటుతో 974 పరుగులు చేసాడు. విండీస్‌తో జరిగే తొలి టీ20లో రాహుల్ వెయ్యి పరుగులు చేస్తే.. భారత్ తరఫున వేగంగా ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పుతాడు.

26 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగులు:
రాహుల్ వెయ్యి పరుగులు చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఆరోన్ ఫించ్ (29 ఇన్నింగ్స్)తో సమానంగా మూడో స్థానంలో నిలుస్తాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 27 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగులు సాధించి భారత్ తరఫున తొలిస్థానాన్ని కైవసం చేసుకోగా.. ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ 26 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగులు చేసి అగ్ర స్థానంలో ఉన్నాడు.

అగ్ర స్థానంలో రోహిత్:
టీమిండియా తరఫున వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ (2539), విరాట్ కోహ్లీ (2450), ఎంఎస్ ధోనీ (1617), సురేశ్‌రైనా (1605), శిఖర్ ధావన్ (1504), యువరాజ్ సింగ్ (1177) లు ఉన్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలవడంతో రాహుల్ కీలక పాత్ర పోషించాడు. నాగ్‌పూర్‌లో జరిగిన నిర్ణయాత్మక ఫైనల్ మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించి భారత్‌కు విజయాన్ని అందించాడు.
'హార్దిక్ స్థానాన్నిభర్తీ చేయడం కోసం రాలేదు.. నా స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం వచ్చా'

పొలార్డ్ @ 953:
విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ కూడా టీ20 ఫార్మాట్‌లో వెయ్యి పరుగుల మైలురాయికి దగ్గరలో ఉన్నాడు. పొలార్డ్ 65 మ్యాచ్‌ల్లో 953 పరుగులతో కొనసాగుతున్నాడు. మరో 47 పరుగులు చేస్తే.. టీమిండియాపై ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. ఇప్పటివరకు విండీస్ ఆటగాళ్లలో క్రిస్ గేల్ (1627), మార్లన్ సామ్యుల్స్ (1611), డ్వేన్ బ్రావో (1142) మాత్రమే వెయ్యి పరుగులు పూర్తి చేసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications