పరుగులు చేయలేకపోతే పిచ్చెక్కుతుంది: కోహ్లీతో సెంచరీ భాగస్వామ్యంపై పంత్

హైదరాబాద్: పరుగులు చేయలేనప్పుడు తనకు పిచ్చెక్కినట్లు అవుతుందని టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.
ఫోర్బ్స్ 2019 జాబితా విడుదల: భారత్ నుంచి పీవీ సింధు ఒక్కతే!
ఇప్పటికే ముగిసిన మూడు టీ20ల సిరిస్‌ను కోహ్లీసేన 3-0తో కైవసం చేసుకుంది. అయితే, మొదటి రెండు టీ20ల్లో నిరాశ పరిచిన రిషబ్ పంత్ మంగళవారం గుయానా వేదికగా జరిగిన మూడో టీ20లో హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
రిషబ్ పంత్ (65 నాటౌట్; 42బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు), కెప్టెన్ విరాట్ కోహ్లీ (52; 45బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో మూడో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఇంకా ఐదు బంతులు ఉండగానే ఛేదించింది.

రోహిత్ శర్మతో కలిసి బీసీసీఐ టీవికి పంత్ ఇంటర్యూ
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మతో కలిసి బీసీసీఐ టీవికి పంత్ ఇంటర్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా పంత్ మాట్లాడుతూ "నా ఇన్నింగ్స్ పట్ల సంతోషంగా ఉంది. నేను పరుగులు చేయనప్పుడు నాకు పిచ్చెక్కుతుంది. అయితే, నేను నా విధానాన్ని అనుసరిస్తూనే ఉన్నాను. అదే ఈ రోజే ఆశించిన ఫలితాలను పొందేలా చేసింది" అని అన్నాడు.
టీ20ల్లో ధోని రికార్డుని బద్దలు కొట్టిన రిషబ్ పంత్
కోహ్లీతో కలిసి పంత్ 106 పరుగుల భాగస్వామ్యం
ఇక, ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి పంత్ 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంపై "నేను, విరాట్ భాయ్ ఆడుతున్నప్పుడు ఒకటే ఆలోచించాం. ఇద్దరం నిలకడగా ఆడుతూ భారీ బాగస్వామ్యాన్ని నెలకొల్పడం.... చివరి ఓవర్లలో దూకుడుగా ఆడాలని నిర్ణయించాం" అని పంత్ తెలిపాడు.

ఎలా ఆడితే పరుగులు చేయగలనో ఆలోచించా
"పలు సందర్భాల్లో పరుగులు చేయలేకపోయిన సందర్భంలో విసుగుచెందాను. దీంతో ఎలా ఆడితే పరుగులు చేయగలనో ఆలోచించాను. నేను సరైన నిర్ణయం తీసుకునే సందర్భాలు ఉన్నాయి, అప్పుడు కూడా నేను ప్రదర్శన చేయలేకపోయాను. క్రికెట్‌లో ఇలాగే జరుగుతుందని, గేమ్‌లో ఇదొక భాగం" అని పంత్ చెప్పుకొచ్చాడు.
రాహుల్ చహర్ అరంగేట్రం.. టీ20ల్లో అరుదైన రికార్డు
l

146 పరుగులకే పరిమితమైన విండిస్
యువ పేసర్ దీపక్ చాహర్ (3/4) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ 146/6 కు పరిమితమైంది. అనంతరం వెస్టిండీస్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని రిషబ్ పంత్ (65 నాటౌట్; 42బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు), కెప్టెన్ విరాట్ కోహ్లీ (52; 45బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో మరో ఐదు బంతులు ఉండగానే భారత్ ఛేదించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications