Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి టెస్టు హైలెట్స్: ఇషాంత్ విజృంభణ: టెస్టుల్లో తొమ్మిదోసారి 5 వికెట్లు

IND V WI 2019 : IND V WI 1st Test Day 2 Highlights, WI Finish At 189/8 At Stumps Against India
India vs West Indies Highlights, 1st Test Day 2: West Indies 189/8 at stumps

హైదరాబాద్: ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా క్రమంగా పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆటలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(58) హాఫ్ సెంచరీతో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 297 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ను ఇషాంత్‌ శర్మ గడగడలాడించాడు. త‌న బౌలింగ్‌తో విండీస్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్ప‌లు పెట్టాడు. ఈ క్రమంలో ఇషాంత్ శర్మ(5/42) అద్భుత ప్రదర్శన చేశాడు. టెస్టుల్లో 5 వికెట్లు తీసుకోవ‌డం ఇషాంత్‌కు ఇది తొమ్మిద‌వ సారి.

PKL 2019: సొంతగడ్డపై నిరాశపరిచిన తమిళ తలైవాస్, మూడో జట్టుగా రికార్డు

విండిస్ బ్యాట్స్‌మన్ ఛేజ్‌(48) ఆకట్టుకోవడంతో రెండో రోజు ఆట ముగిసే సరికి విండీస్‌ 59 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్‌ 108 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ ఐదు వికెట్లు తీయగా... బుమ్రా, ష‌మీ, జ‌డేజాలు చెరో వికెట్ తీసుకున్నారు.

షమి బౌలింగ్‌లో బౌల్డ్‌

షమి బౌలింగ్‌లో బౌల్డ్‌

వెస్టిండిస్ ఓపెనర్లు ఇన్నింగ్స్‌‌ను మెరుగ్గానే ఆరంభించినా దానిని కొనసాగించలేకపోయారు. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లో క్యాంప్‌బెల్‌(23) షమి బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత బ్రాత్‌వైట్‌(14)ను ఇషాంత్‌ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్రూక్స్(11) కూడా జడేజా బౌలింగ్‌లో స్లిప్‌లో రహానేకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

50 పరుగులకే మూడు వికెట్లు

50 పరుగులకే మూడు వికెట్లు

దీంతో 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన వెస్టిండిస్‌ను చేజ్‌ ఆదుకున్నాడు. డారెన్‌ బ్రావో(18)తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాదు. దీంతో టీ విరామ సమయానికి విండీస్‌ 82/3తో కాస్త మెరుగ్గానే కనిపించింది. టీ విరామ అనంతరం బుమ్రా ఇన్నింగ్స్ 30వ ఓవర్‌ మొదటి బంతికి బ్రావోను ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు.

షాయ్ హోప్‌తో కలిసి చేజ్‌

షాయ్ హోప్‌తో కలిసి చేజ్‌

అనంతరం క్రీజులోకి వచ్చిన షాయ్ హోప్‌తో కలిసి చేజ్‌ విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. హాఫ్ సెంచరీకి చేరువయ్యే క్రమంలో ఇషాంత్‌ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత 54వ ఓవర్‌ ఆఖరి బంతికి షై హోప్‌(24)ను ఇషాంత్ శర్మ పెవిలియన్‌కు చేర్చగా... హెట్ మెయిర్‌(35), రోచ్‌(0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.

నాలుగు వికెట్లు పడగొట్టిన రోచ్

నాలుగు వికెట్లు పడగొట్టిన రోచ్

రెండో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో కెప్టెన్‌ జాసన్ హోల్డర్‌(10), మిగ్యుఎల్ కమ్మిన్స్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. అంతకముందు జడేజా హాఫ్ సెంచరీతో రాణించడంతో టీమిండియా 297 పరుగులకు ఆలౌటైంది. విండీస్‌ బౌలర్లలో రోచ్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Saturday, August 24, 2019, 10:58 [IST]
Other articles published on Aug 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+