
అధికార ప్రకటన చేయలేదు:
గుడ్‌బై చెపుతున్నట్టు క్రిస్ గేల్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ భారత పేసర్ ఖలీల్ బౌలింగ్‌లో ఔటై పెవిలియన్ చేరుతుంటే.. అందరికీ అర్థమైపోయింది అదే అతడికి చివరి మ్యాచ్ అని. భారత ఆటగాళ్లంతా అతణ్ని అభినందించారు. కోహ్లీతో కలిసి తనదైన శైలిలో ఎ స్టెప్పూ వేసిన గేల్.. మైదానాన్ని వీడుతూ హెల్మెట్లో బ్యాట్‌ను పెట్టి పైకెత్తి అభిమానులకు అభివాదం చేశాడు. దీంతో గేల్ గుడ్‌బై చెపుతున్నట్టు అర్ధమైంది. ఇక గేల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడమే ఉంది.

మెరుపు ఇన్నింగ్స్:
గేల్ చివరగా తనదైన శైలిలో ఓ మెరుపు ఇన్నింగ్స్ (41 బంతుల్లో 72, 8 ఫోర్లు, 5సిక్స్‌లు) తో నిష్క్రమించాడు. భువనేశ్వర్ తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించిన గేల్.. అనంతరం ఫ్రీ హిట్‌ను సిక్స్‌గా మలిచి పరుగుల ఖాతా తెరిచాడు. అక్కడి నుండి గేల్ భారత బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వర్షం కురిపించాడు. అతని దెబ్బకు స్కోరు బోర్డును పరుగులు పెట్టింది. గేల్ సునామీతో విండీస్ 12 ఓవర్లకు 121 పరుగులు చేసింది. తొలి 16 బంతుల్లో 10 పరుగులే చేసిన గేల్.. 31 బంతుల్లో 56 పరుగులు చేసాడు.

సహనాన్ని కూడా చూపాడు:
గేల్ కెరీర్‌లో బెస్ట్ టెస్టు ఇన్నింగ్స్ అనగానే 333 పరుగులు గుర్తొస్తాయి. కానీ 2009లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గేల్ ఏడున్నర గంటల పాటు క్రీజులో ఉండి 165 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. ఆ మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. దీంతో గేల్ తనలోని సహనాన్ని చూపాడు. ఆ తర్వాతి సంవత్సరమే శ్రీలంకపై 333 పరుగులు చేశాడు. 2005లోనూ దక్షిణాఫ్రికాపై అతడు ట్రిపుల్ సెంచరీ చేశాడు.
వికాస్ విజృంభణ.. హరియాణా హ్యాట్రిక్

రికార్డులు:
విండీస్ తరఫున ఎక్కువ వన్డేలు ఆడిన బ్యాట్స్‌మెన్ (301)గా, వన్డేల్లో ఎక్కువ పరుగులు (10,480) సాధించిన రికార్డులు గేల్‌పైనే ఉన్నాయి . అంతర్జాతీయ టీ20లో మొదటి సెంచరీ (2007 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై), అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు (105) బాదిన రెండో బ్యాట్స్‌మన్, టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన నలుగురిలో ఒక్కడు, ఇక వన్డేల్లో డబుల్ సెంచరీలు రికార్డులు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications
