Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ X వెస్టిండీస్ ఆఖరి టీ20కి భారీ అడ్డంకి!

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య జరగాల్సిన ఆఖరి టీ20కి భారీ అడ్డంకి ఏర్పడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం జరగాల్సిన ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్‌ నిర్వహణ కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

శనివారం సాయంత్ర 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వర్షం పడే సూచనలు 66-69 శాతం వరకు ఉన్నాయని బెంగళూరు వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్ ప్రారంభమయ్యే 7 గంటల సమయంలో వర్షం పడే అవకాశం 69 శాతంగా ఉందని అంచనా వేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ హైఓల్టేజ్ ఫైనల్ మ్యాచ్ రద్దవుతుందనే ఆందోళన నెలకొంది.

ఒకవేళ మ్యాచ్ పాక్షికంగా జరిగినా.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఫలితాన్ని నిర్దేశిస్తారు. అదే జరిగితే ఒక జట్టు తీవ్రంగా నష్టపోనుంది. కనీసం ఇరు జట్ల మధ్య 5 ఓవర్ల ఆట సాధ్యమైతేనే డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఫలితాన్ని తేల్చుతారు. చిన్నదైన చిన్నస్వామి స్టేడియంలో 5 ఓవర్ల మ్యాచ్‌ భారత్‌కు నష్టం చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పూర్తి మ్యాచ్ జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

India vs West Indies 5th T20I Weather Report Rain Threat Looms Over Bengaluru Series Decider

చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునాతన డ్రైనేజీ సిస్టమ్ ఉండటం కలిసొచ్చే అంశం. వర్షం కాస్త ఆగితే క్షణాల్లో మైదానాన్ని సిద్దం చేయగలరు. కానీ వర్షం ఆగకుంటే మాత్రం మ్యాచ్ బంతి పడకుండానే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది.

భారీ స్కోర్లు నమోదైన ఈ సిరీస్‌లో ఇరు జట్లు రెండేసి విజయాలతో 2-2తో సమంగా నిలిచాయి. దాంతో ఆఖరి టీ20 సిరీస్ డిసైడర్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం ముప్పు అనే వార్తలను ఇరు జట్లతో పాటు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఒకవేళ మ్యాచ్ సజావుగా సాగితే టీమిండియా భిన్నమైన కాంబినేషన్‌తో బరిలోకి దిగనుంది. సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి తిరిగి రానుండగా.. ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్‌లో ఒకరు బెంచ్‌కే పరిమితం కానున్నారు. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇస్తారా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

గత నాలుగు మ్యాచ్‌లుగా అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో సంజూ, అభిషేక్ చెరో రెండు మ్యాచ్‌ల్లో రాణించారు. భారత్ సిరీస్ కూడా గెలవకపోవడంతో వైభవ్‌కు అవకాశం ఇస్తారా? లేక బెంచ్‌కే పరిమితం చేస్తారా? అనేది సందేహంగా మారింది. అభిషేక్ శర్మకు రెస్ట్ ఇచ్చి వైభవ్‌ను ఆడించాలనే వాదన వినిపిస్తోంది. కానీ గౌతమ్ గంభీర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Story first published: Friday, October 16, 2026, 12:14 [IST]
Other articles published on Oct 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+