9 ఏళ్ల తర్వాత ఆ స్టేడియంలో మ్యాచ్: గంట కొట్టనున్న సచిన్


హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా అక్టోబర్ 29న జరిగే మ్యాచ్‌కు వాంఖడే మైదానానికి బదులు బ్రబౌర్న్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ వన్డేకు ముంబైలోని వాంఖడె మైదానం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ, ఆర్థిక అవరోధాలను చూపుతూ ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఈ మ్యాచ్‌ని నిర్వహించలేమని చేతులెత్తేసింది.

అక్టోబర్ 29న వాంఖడేలో నిర్వహించే మ్యాచ్ వేదికను
దీంతో సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీ ఆదేశాల మేరకు 29న వాంఖడేలో నిర్వహించే మ్యాచ్ వేదికను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ) స్టేడియానికి బీసీసీఐ మార్చింది. దీంతో దీంతో దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఈ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. బ్రబౌర్న్ స్టేడియం కూడా వాంఖడెకు అతి సమీపంలోనే ఉండటం విశేషం.
విశాఖ వన్డే: ధోని ఆఖరి ఓవర్ ఫీల్డింగ్ మార్పుపై కుల్దీప్ సంచలన వ్యాఖ్య

బ్రబౌర్న్ స్టేడియం పిచ్ అంచనాలకు తగ్గట్టుగానే
అయితే ఈ మ్యాచ్‌కి ముందు ఆరంభ గంటను కొట్టడానికి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను ఆహ్వానించినట్లు స్టేడియం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా స్టేడియం నిర్వాహకులు మాట్లాడుతూ "తొమ్మిదేళ్ల తర్వాత ఓ అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న బ్రబౌర్న్ స్టేడియం పిచ్ అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది. ఇక్కడ భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి" అని అన్నారు.

ఈ స్టేడియాన్ని పర్యాటక జట్ల ప్రాక్టీస్ కోసం
2009లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ జరిగిన తర్వాత ఇక్కడ మ్యాచ్‌లు నిర్వహించడం లేదు. అప్పటి నుంచి ఎక్కువగా ఈ స్టేడియాన్ని పర్యాటక జట్ల ప్రాక్టీస్ కోసం వాడుతున్నారు. ఇక మ్యాచ్‌కు ముందు ఆరంభ గంటను కొట్టే సంప్రదాయం ఇంగ్లాండ్‌లోని చరిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో మొదలైంది.

ఈడెన్‌గార్డెన్స్‌లోనూ ఈ గంట కొట్టే సంప్రదాయం
భారత్‌లో కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లోనూ ఈ గంట కొట్టే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఏదైనా టెస్టు మ్యాచ్ ప్రారంభమయ్యే రోజున ప్రముఖ క్రికెటర్లను గంట కొట్టేందుకు ఆహ్వానిస్తుంటారు. ఈ సిరీస్‌లో వన్డే వేదిక మారడం ఇది రెండోసారి. అక్టోబర్ 24న ఇండోర్‌లో జరగాల్సిన రెండో వన్డేను కాంప్లిమెంటరీ పాస్‌ల వివాదం కారణంగా విశాఖకు తరలించారు. ఈ మ్యాచ్ టైగా ముగిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications