For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విశాఖ వన్డే: ధోని ఆఖరి ఓవర్ ఫీల్డింగ్ మార్పుపై కుల్దీప్ సంచలన వ్యాఖ్య

Kuldeep Yadav Feels India Did Well In Difficult Bowling Conditions During 2nd ODI vs Windies

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఆఖరి ఓవర్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పథకం పారకపోవడంపై చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ తనదైన శైలిలో స్పందించాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డేలో మహేంద్ర సింగ్ ధోనీ ఊహించిన పథకం పారలేదు. పైగా అతడి వ్యూహం ప్రత్యర్థికే లాభించింది. వ్యూహాన్ని పసిగట్టిన విండీస్‌ బ్యాట్స్‌మన్‌ షై హోప్‌ ఆఖరి బంతికి బౌండరీతో తన జట్టును ఓటమి నుంచి రక్షించాడు.

వెస్టిండిస్ గెలవాలంటే చివరి ఓవర్లో వెస్టిండీస్‌ 14 పరుగులు చేయాలి. కోహ్లి.. బంతిని ఉమేశ్‌కు ఇచ్చాడు. ఉమేశ్.. యార్కర్‌తో ఓవర్‌ను ఆరంభించగా.. హోప్‌ సింగిల్‌ మాత్రమే తీయగలిగాడు. హోప్‌ సెంచరీ పూర్తి చేసినా.. అప్పటికి దాదాపుగా మూడు ఓవర్ల నుంచి బౌండరీ కొట్టలేదు. భారత బౌలర్లు పదే పదే స్ట్రెయిట్‌గా ఫుల్‌ డెలివరీలు వేయడమే అందుకు కారణం. నర్స్‌కు కూడా ఉమేశ్‌ ఇదే వ్యూహానికి కట్టుబడి బౌలింగ్‌ చేశాడు.

 ఓ బంతికి ఫోర్‌ లెగ్‌బైస్‌ రాగా

ఓ బంతికి ఫోర్‌ లెగ్‌బైస్‌ రాగా

ఓ బంతికి ఫోర్‌ లెగ్‌బైస్‌ రాగా.. లెగ్‌స్టంప్‌ యార్కర్‌ను ఆడి నర్స్‌ రెండు పరుగులు రాబట్టాడు. తర్వాత ఫుల్‌టాస్‌ను స్కూప్‌ చేసి థర్డ్‌మాన్‌లో ఫీల్డర్‌కు దొరికిపోయాడు. చివరి 2 బంతులకు 7 పరుగులు అవసరం కాగా.. స్టంప్స్‌ పైకి వేసిన మరో ఫుల్‌టాస్‌ను హోప్‌ సరిగా ఆడలేకపోయాడు. బంతిని డీప్‌మిడ్‌వికెట్లోకి పంపి 2 పరుగులు తీశాడు. దీంతో ఆఖరి బంతికి వెస్టిండిస్‌కు 5 పరుగులు అవసరమయ్యాయి.

ధోని ఆఖరి బంతికి మాత్రం ఫీల్డింగ్‌ను మార్చేశాడు

ధోని ఆఖరి బంతికి మాత్రం ఫీల్డింగ్‌ను మార్చేశాడు

ఈ ఓవర్‌కు వ్యూహ రచన చేసిన ధోని ఆఖరి బంతికి మాత్రం ఫీల్డింగ్‌ను మార్చేశాడు. థర్డ్‌మ్యాన్‌ను మరి కాస్త లోపలకు తీసుకొచ్చి పాయింట్‌ ఫీల్డర్‌ను డీప్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ వద్దకు పంపించాడు. స్వీపర్‌ కవర్, లాంగాఫ్‌ను కూడా తప్పించాడు. అయితే ఈ వ్యూహం వ్యతిరేకంగా పని చేసి ఆఖరి బంతిని హోప్‌ ఫోర్‌ కొట్టి మ్యాచ్‌ను ‘టై'గా ముగించాడు.

కుల్దీప్‌ యాదవ్‌ను ప్రశ్నించగా అతను భిన్నంగా

కుల్దీప్‌ యాదవ్‌ను ప్రశ్నించగా అతను భిన్నంగా

ఈ విషయంపై మ్యాచ్‌ తర్వాత మీడియా సమావేశంలో కుల్దీప్‌ యాదవ్‌ను ప్రశ్నించగా అతను భిన్నంగా స్పందించాడు. "ఇది ధోని ప్రణాళిక. దాని గురించి తెలిసేంత పెద్దవాడిని కాను. నేను 30 మ్యాచ్‌లు మాత్రమే ఆడాను. మహి భాయ్‌ 300 మ్యాచ్‌లు ఆడాడు. మా అందరికంటే అతనికి చాలా ఎక్కువ అనుభవం ఉంది. ఆ సమయంలో అతను అనుకున్నది అమలు చేశాడు" అని కుల్దీప్ అన్నాడు.

 పది నెలల క్రితం జరిగిన ఒక ఘటనను గుర్తు చేసుకొని

పది నెలల క్రితం జరిగిన ఒక ఘటనను గుర్తు చేసుకొని

పది నెలల క్రితం జరిగిన ఒక ఘటనను గుర్తు చేసుకొని కుల్దీప్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండోర్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్‌లో ధోని ఫీల్డింగ్‌ మార్పులు చేస్తూ కవర్‌ను తప్పించి పాయింట్‌ను మరింత ముందుకు తీసుకు రమ్మని బౌలర్‌ కుల్దీప్‌కు సూచించాడు. అయితే ధోని మాటను కుల్దీప్ లెక్కచేయకపోవడంతో చిర్రెత్తిన ధోని ‘300 మ్యాచ్‌లు ఆడిన నేనేమైనా పిచ్చివాడినా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, October 26, 2018, 12:00 [IST]
Other articles published on Oct 26, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+