
మ్యాచ్‌కు వర్ష గండం..
వాతావరణం అనుకూలించడంతో తొలి రెండు వన్డేలు సజావుగా సాగాయి. కానీ మూడో వన్డేకు వర్ష గండం పొంచి ఉంచింది. weather.com వెబ్‌సైట్ వివరాల ప్రకారం మ్యాచ్ జరిగే పోర్ట్ ఆఫ్ స్పెయిన్(ట్రినిడాడ్)లో బుధవారం ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల నుంచి 25 డిగ్రీల మధ్య నమోదు కానున్నాయి. రోజు మొత్తం మేఘాలను మబ్బులు కమ్మేయనున్నాయి. డేలో 66 శాతం, రాత్రి వేళలో 40 శాతం వర్షం వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మూడో వన్డేకు అంతరాయం కలిగే చాన్స్ ఉంది. హుమిడిటీ కూడా 75 శాతం ఉండనుంది.

పిచ్ రిపోర్ట్..
ఈ మైదానంలోనే జరిగిన తొలి రెండు వన్డేల్లో పిచ్ బ్యాటింగ్‌కు చక్కగా సహకరించింది. ఈ మ్యాచ్‌లోనూ పిచ్ స్వభావంలో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. పిచ్ కాస్త నెమ్మదిస్తే బౌలర్లు ఎక్కువగా ప్రభావం చూపే ఆస్కారముంది. ఈ మైదానంలో టీమిండియా ఆడిన చివరి 11 మ్యాచ్‌ల్లో 10 గెలిచింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ వికెట్‌పై ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు స్కోర్ 220, రెండో ఇన్నింగ్స్ యావరేజ్ 181. ఈ స్టేడియంలో అత్యధిక స్కోర్ 413/5. ఇది కూడా 2007లో భారత్ సాధించింది. ఇక్కడ మొత్తం 71 వన్డేలు జరగ్గా.. గత మ్యాచ్‌లోనే రెండు జట్లు 300 ప్లస్ పరుగులు చేసాయి.

పెద్దగా మార్పులుండవ్..
సిరీస్ సొంతమైనప్పటికీ టీమిండియా తుది జట్టులో భారీ మార్పులు చేయకపోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్‌ను కదపకపోవచ్చు. వరుసగా 64, 43 చేసిన శుభ్‌మన్ గిల్‌ను కాదని రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు కల్పించే పరిస్థితి లేదు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో అవకాశాలు దక్కించుకున్నా రుతురాజ్ అసౌకర్యంగా కనిపించాడు. శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ రెండో వన్డేలో అర్ధశతకాలు బాది ఫామ్‌లో ఉన్నారు. తొలి రెండు వన్డేల్లో విఫలమైనప్పటికీ సూర్యకుమార్ యాదవ్ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఇషాన్ కిషన్ పెవిలియన్‌కే పరిమితం కాక తప్పదు. ఇక చిన్న గాయం వల్ల తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయిన తొలి ప్రాధాన్య ఆల్‌రౌండర్ జడేజా.. ఆఖరి మ్యాచ్‌లో ఆడడంపైనా అనిశ్చితి నెలకొంది. అవేష్ ఖాన్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకునే అవకాశం ఉంది.

తుది జట్లు (అంచనా):
భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్/రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్/అర్షదీప్ సింగ్, చాహల్, సిరాజ్
వెస్టిండీస్: షై హోప్, కింగ్, బ్రూక్స్, మేయర్స్, పూరన్ (కెప్టెన్), పావెల్, హోల్డర్, అకీల్, అల్జారి జోసెఫ్, మోటీ, సీల్స్


Click it and Unblock the Notifications
