For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs West Indies 2nd ODI సజావుగా సాగెనా? వర్ష సూచన ఏమైనా ఉందా?

India vs West Indies 2nd ODI Weather Report: Will Rain Spoil The ODI Match At Port of Spain

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: ఐదుగురు స్టార్‌ ఆటగాళ్లు లేకపోయినా... మరో వన్డే సిరీస్‌ విజయానికి భారత జట్టు బాటలు వేసుకుంది. తొలి మ్యాచ్‌లో విండీస్‌పై స్వల్ప తేడాతో నెగ్గిన టీమిండియా కరీబియన్‌ పర్యటనలో వరుసగా రెండో సిరీస్‌ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌లో జరిగే రెండో వన్డేలో భారత్, విండీస్‌ తలపడనున్నాయి. సొంతగడ్డపై కొద్ది రోజుల క్రితమే బంగ్లాదేశ్‌కు సిరీస్‌ అప్పగించిన వెస్టిండీస్‌ మరో సిరీస్‌ కోల్పోరాదంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.

 వర్ష గండం ఉందా?

వర్ష గండం ఉందా?

అయితే వెస్టిండీస్ వాతావరణం ఎప్పుడూ వేడిగా ఉంటోంది. అక్కడ వర్షాలు వచ్చే అవకాశం తక్కువే. కానీ భారత జట్టు వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి అక్కడి వాతావరణం చల్లగా మారింది. మేఘాలు కమ్ముకోవడంతో పాటు చిరు జల్లులు పడ్డాయి. రెండో వన్డే జరిగే పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వర్షాలు పడుతున్నాయి. అయితే ఇక్కడే జరిగిన తొలి వన్డేకు ఎలాంటి అంతరాయం కలగలేదు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వాతావరణ శాఖ కూడా ఈ రోజు కూడా వర్షం వచ్చే అవకాశం లేదని చెబుతోంది. ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల నుంచి 32 డిగ్రీల నమోదు కానున్నాయని, గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయని తెలిపింది.

పిచ్ రిపోర్ట్..

పిచ్ రిపోర్ట్..

తొలి వన్డేలో పిచ్‌ మొదట బ్యాటింగ్‌కు చక్కగా సహకరించింది. కానీ బంతి కాస్త పాతబడ్డాక పరుగులు కష్టంగా వచ్చాయి. ఛేదనలోనూ బ్యాటర్లు పరుగులు రాబట్టారు. ఈ మ్యాచ్‌లోనూ పిచ్‌ స్వభావంలో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. పిచ్‌ కాస్త నెమ్మదిస్తే బౌలర్లు ఎక్కువగా ప్రభావం చూపే ఆస్కారముంది. ఈ మైదానంలో టీమిండియా ఆడిన చివరి 10 మ్యాచ్‌ల్లో 9 గెలిచింది. మరో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది.

మిడిలార్డర్ చెలరేగితే..

మిడిలార్డర్ చెలరేగితే..

కెప్టెన్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌.. ఈ టాప్‌ఆర్డర్‌ తొలి వన్డేలో భారత్‌ భారీస్కోరుకు బాటలు వేసింది. కొంతకాలంగా ఫామ్‌ లేమితో సతమతమవుతున్న ధావన్‌, శ్రేయస్‌ తిరిగి పరుగులు చేయడం ఊరట కలిగించే విషయం. రుతురాజ్‌, ఇషాన్‌ను దాటి ఓపెనర్‌గా వచ్చిన గిల్‌ రాణించడం శుభ పరిణామం.

రెండో వన్డేలోనూ ఈ త్రయం ఇదే జోరు కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది. ఇక గత మ్యాచ్‌లో విఫలమైన మిడిలార్డర్‌ సత్తాచాటాల్సిన అవసరం ఉంది. ఆ మ్యాచ్‌లో 350కి పైగా పరుగులు చేసేలా కనిపించిన జట్టు మిడిలార్డర్‌ వైఫల్యంతో తక్కువ స్కోరుకే సరిపెట్టుకుంది. దీపక్‌ హుడా, సూర్య కుమార్‌ కాస్త సమయం క్రీజులో గడిపితే సరిపోతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం శాంసన్‌కు అత్యావశ్యకం. బౌలింగ్‌లో సిరాజ్‌, శార్దూల్‌, చాహల్‌తో పాటు మిగతా బౌలర్లూ వికెట్లు తీయాలి. ప్రమాదకర బ్యాటింగ్‌ లైనప్‌తో కూడిన విండీస్‌ను ఎంత త్వరగా కట్టడి చేస్తే అంత మంచింది.

 తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

భారత్‌: శిఖర్ ధావన్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్, దీపక్‌ హుడా, సంజూ శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్, ప్రసిద్ధ్‌ కృష్ణ, చాహల్‌, సిరాజ్‌

వెస్టిండీస్‌: షై హోప్‌, కింగ్‌, బ్రూక్స్‌, మేయర్స్‌, పూరన్‌ (కెప్టెన్‌), పావెల్‌, హోల్డర్‌, అకీల్‌, అల్జారి జోసెఫ్‌, మోటీ, సీల్స్‌

Story first published: Sunday, July 24, 2022, 8:13 [IST]
Other articles published on Jul 24, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+