న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండీస్‌తో ఆఖరి టీ20: క్లీన్‌స్వీప్‌పై భారత్‌ కన్ను.. జట్టులో మార్పులు

India vs West Indies 2019,3rd T20I : Virat Kohli Hinted That He Might Experiment With The Line-Up
India vs West Indies 2019: Probable India XI For 3rd T20I, Changes galore, debut expected in 3rd T20I

గయానా: తొలి రెండు మ్యాచ్‌లు అమెరికాలో జరగగా.. మూడో మ్యాచ్‌ మంగళవారం గయానా ( విండీస్‌ గడ్డ)లో జరగనుంది. తొలి మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్‌ అంతగా ఆకట్టుకోకపోయినా.. రెండో మ్యాచ్‌లో పుంజుకుని భారీ స్కోర్ చేశారు. రెండు వరుస విజయాలతో ఇప్పటికే సిరీస్‌ నెగ్గి ఊపు మీదున్న టీమిండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేయగా.. కనీసం చివరి టీ20లో అయినా విజయం సాధించి పరువు దక్కించుకోవాలని వెస్టిండీస్‌ ఆశిస్తోంది. ఇప్పటికే సిరీస్‌ సొంతమైన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో భారత్‌ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వనున్నారు.

<strong>క్రికెట్‌కు బ్రెండన్ మెకల్లమ్ వీడ్కోలు</strong>క్రికెట్‌కు బ్రెండన్ మెకల్లమ్ వీడ్కోలు

 అయ్యర్‌కు చోటు:

అయ్యర్‌కు చోటు:

ఓపెనర్ రోహిత్ శర్మ ఫామ్ కొనసాగిస్తుంటే.. గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమైన మరో ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం ఇప్పటి వరకు సరైన ప్రదర్శన చేయలేదు. ధావన్‌ తిరిగి ఫామ్ అందుకోవాలని తహతహలాడుతున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు మ్యాచ్‌ల్లో ఫర్వాలేదనిపించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నరిషబ్ పంత్ పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. దీంతో పంత్ ఈ మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిందే. ఇక మనీశ్ పాండే ఆకట్టుకోలేకపోయాడు. దీంతో బెంచ్‌కే పరిమితమైన శ్రేయస్ అయ్యర్‌కు తుది జట్టులో చోటు దక్కనుంది.

చహర్‌ బ్రదర్స్‌కు అవకాశం:

చహర్‌ బ్రదర్స్‌కు అవకాశం:

బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆకట్టుకుంటున్న కృనాల్ పాండ్యా కొనసాగనున్నాడు. సీనియర్ రవీంద్ర జడేజాకు విశ్రాంతిని ఇచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ఆకట్టుకున్న యువ స్పిన్నర్ రాహుల్ చాహర్ అరంగేట్రం చేయనున్నాడు. నవదీప్ సైనీకి విశ్రాంతినిచ్చి దీపక్ చాహర్‌ను ఆడించొచ్చు. భువనేశ్వర్, ఖలీల్‌లు కొనసాగనున్నారు.

గుండె పోటుతో భారత బ్యాడ్మింటన్‌ కోచ్‌ మృతి

సొంతగడ్డపై అయినా:

సొంతగడ్డపై అయినా:

టీ20 ఫార్మాట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌, బలమైన జట్టు అయిన వెస్టిండీస్‌ చెత్త ఆటతో నిరాశపరిచింది. ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలని విండీస్ భావిస్తోంది. ఓపెనర్‌ లూయిస్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. మరో ఓపెనర్‌ క్యాంప్‌బెల్‌కు ఇంకో చాన్స్‌ దక్కవచ్చు. పూరన్, పావెల్ ధాటిగా ఆడాల్సి ఉంది. కీరన్‌ పొలార్డ్‌, హెట్‌మయెర్‌, బ్రాత్‌వైట్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ రావాల్సి ఉంది. అయితే విండీస్ బౌలర్లు మాత్రం రాణిస్తున్నారు. కాట్రెల్, థామస్, కీమో పాల్ అంచనాలకు తగ్గట్లు రాణిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో నెగ్గి వన్డే సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని ఇరుజట్లు చూస్తున్నాయి.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

భారత్‌: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్‌, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా/రాహుల్‌ చాహర్‌, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్.

వెస్టిండీస్‌: బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), క్యాంప్‌బెల్, నరైన్, పూరన్, హెట్‌మైర్, పొలార్డ్, రావ్‌మన్‌ పావెల్, కీమో పాల్, ఖారీ పైర్, కాట్రెల్, థామస్‌.

Story first published: Tuesday, August 6, 2019, 10:39 [IST]
Other articles published on Aug 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X