For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చివరి టీ20లో భారత్‌ ఘన విజయం.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

IND V WI 2019, 3rd T20I : Team India Complete 3-0 Whitewash Against West Indies In T20I Series
India vs West Indies 2019: Deepak Chahar, Rishab Pant shine as India complete series 3-0 whitewash against West Indies in T20I series

గయానా: చివరిదైన మూడవ టీ20లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ (65 నాటౌట్‌; 42బంతుల్లో 4×4, 4×6), కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (52; 45బంతుల్లో 6×4) అర్ధ శతకాలతో చెలరేగడంతో మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. వెస్టిండీస్‌ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఇంకా ఐదు బంతులు ఉండగానే ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

మళ్లీ నిరాశే:

మళ్లీ నిరాశే:

147 పరుగుల లక్ష్య చేధనలో.. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ శిఖర్ ధావన్‌ (3) మళ్లీ నిరాశ పరిచాడు. విండీస్ పేసర్ థామస్‌ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌ ఆఖరి బంతికి షాట్‌ ఆడే క్రమంలో కాట్రెల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (20; 18బంతుల్లో 2×4, 1×6) పర్వాలేదనిపించారు. అయితే ఇన్నింగ్స్ కుదుటపడుతున్న సమయంలో అలెన్‌ బౌలింగ్‌లో స్టంపౌట్‌ అయ్యాడు.

భారీ భాగస్వామ్యం:

భారీ భాగస్వామ్యం:

అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఈ జోడీ ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఇక క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో 16వ ఓవర్‌లో కోహ్లీ.. 17వ ఓవర్‌లో పంత్‌ అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నాడు. అయితే థామస్‌ బౌలింగ్లో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో కోహ్లీ క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు.

పంత్ షో:

పంత్ షో:

కోహ్లీ నిష్క్రమణ అనంతరం థామస్‌ బౌలింగ్లోనే పంత్ సిక్స్ బాది టీమిండియాను విజయానికి చేరువ చేసాడు. కాట్రెల్‌ వేసిన 19వ ఓవర్లో మనీష్ పాండే (2) తడబడంతో ఇన్నింగ్స్ చివరి ఓవర్ వరకు వెళ్ళింది. ఇక బ్రాత్‌వైట్‌ వేసిన చివరి ఓవర్‌ మొదటి బంతికే పంత్ సిక్సర్‌ బాది టీమిండియాకు విజయాన్ని అందించాడు. గత రెండు మ్యాచుల్లో విఫలమయిన పంత్.. ఈ మ్యాచులో ఆకట్టుకున్నాడు.

భారత్‌తో జరిగిన ఆ మ్యాచే నా కెరీర్‌లో ఓ చేదు జ్ఞాపకం

చహర్‌ సూపర్‌ స్పెల్:

చహర్‌ సూపర్‌ స్పెల్:

అంతకుముందు వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యంగా ఆరంభం అయింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్ జట్టును కీరన్‌ పొలార్డ్‌ (58; 45 బంతుల్లో 1×4, 6×6) అర్ధ శతకంతో ఆదుకున్నాడు. చివర్లో పావెల్‌ (32 నాటౌట్‌; 20 బంతుల్లో 1×4, 2×6) మెరుపులతో విండీస్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది. మూడు వికెట్లు తీసిన భారత బౌలర్ దీపక్‌ చాహర్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' లభించింది. గురువారం ఇదే మైదానంలో తొలి వన్డే మ్యాచ్‌ జరగనుంది.

1
46246
Story first published: Wednesday, August 7, 2019, 8:39 [IST]
Other articles published on Aug 7, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+