
వర్ష గండం ఉందా?
అయితే వెస్టిండీస్ వాతావరణం ఎప్పుడూ వేడిగా ఉంటోంది. అక్కడ వర్షాలు వచ్చే అవకాశం తక్కువే. కానీ భారత జట్టు వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి అక్కడి వాతావరణం చల్లగా మారింది. మేఘాలు కమ్ముకోవడంతో పాటు చిరు జల్లులు పడ్డాయి. ముఖ్యంగా తొలి వన్డే జరిగే పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వర్షాలు పడుతున్నాయి. వర్షం కారణంగా టీమిండియా ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దయింది. భారత కెప్టెన్ శిఖర్ ధావన్ సైతం వెస్టిండీస్ వాతావరణం తమకు సవాల్ విసురతుందని చెప్పాడు. అయితే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వాతావరణ శాఖ మాత్రం వర్షం వచ్చే అవకాశం లేదని చెబుతోంది. ఆకాశాన్ని మబ్బులు కమ్మేసే అవకాశం ఉందని, పడితే చిరు జల్లులు మినహా భారీ వర్షం అయితే లేదని స్పష్టం చేసింది. ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల నుంచి 32 డిగ్రీల నమోదు కానున్నాయని, గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయని తెలిపింది.

పిచ్ రిపోర్ట్..
క్వీన్స్ పార్క్ ఓవల్‌లోని పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానంగా సహకరించే అవకాశం ఉంది. స్పిన్నర్లు ఆధిపత్యం చలాయించొచ్చు. ఈ మైదానంలో చివరగా 2019లో అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. మేఘాలు కమ్ముకునే ఆస్కారముంది. ఈ మైదానంలో టీమిండియా ఆడిన చివరి తొమ్మిది మ్యాచ్‌ల్లో 8 గెలిచింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

శుభ్‌మన్ గిల్‌తో ధావన్ ఓపెనింగ్..
తొలి వన్డేలో టీమ్‌ఇండియా కూర్పు ప్రశ్నార్థకంగా మారింది. తిరిగి జట్టులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్‌తో కలిసి ధావన్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. ఫామ్ అందుకోవడానికి ధావన్‌కు ఈ సిరీస్ మంచి అవకాశమనే చెప్పాలి. మరోవైపు రుతురాజ్, ఇషాన్ కూడా ఇన్నింగ్స్ ఆరంభించేందుకు పోటీలో ఉన్నారు. షార్ట్‌పిచ్ బంతికి వికెట్ పారేసుకుంటున్న శ్రేయస్‌పై ఒత్తిడి ఉంది. అతనా బలహీనతను అధిగమించాల్సిన అవసరముంది. దీపక్ హుడా, సూర్యకుమార్ తుది జట్టులో ఉంటారు. శార్దూల్ ఠాకూర్ పేస్ ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తాడు. స్పిన్నర్లుగా చాహల్, జడేజా కొనసాగడం ఖాయం. పొత్తికడుపు నొప్పితో ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు దూరమైన అర్ష్‌దీప్ వన్డే అరంగేట్రం చేస్తాడో లేదో చూడాలి. వన్డేల్లో తన ముద్ర వేసేందుకు సిరాజ్‌కు ఇది మంచి ఛాన్స్. అతనితో కలిసి అవేశ్ లేదా ప్రసిద్ధ్‌లో ఎవరు కొత్త బంతిని పంచుకుంటారన్నది ఆసక్తికరం.

తుది జట్లు (అంచనా):
భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్/రుతురాజ్/ఇషాన్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్/ప్రసిద్ధ్ కృష్ణ, చాహల్, సిరాజ్
వెస్టిండీస్: షై హోప్, కింగ్, బ్రూక్స్, మేయర్స్, పూరన్ (కెప్టెన్), పావెల్, హోల్డర్, అకీల్, అల్జారి జోసెఫ్, మోటీ, సీల్స్


Click it and Unblock the Notifications












