For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'సంక్లిష్ట పరిస్థితుల్లో సెంచరీ చేశా.. అది ఎంతో ప్రత్యేకం.. అందుకే భావోద్వేగం'

India vs West Indies: 10th Test hundred was special as it rescued team from sticky situation says Ajnikya Rahane

జమైకా: జట్టు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు సెంచరీ చేశా. ఆ సెంచరీ నాకు ఎంతో ప్రత్యేకం. రెండేళ్ల తర్వాత సెంచరీ బాదడంతో కాస్త భావోద్వేగం చెందా అని టీమిండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే పేర్కొన్నారు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారీ విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్టుకు సిద్దమయింది. శుక్రవారం నుంచి కింగ్‌స్టన్‌ వేదికగా ఆరంభం కానున్న రెండో టెస్టును సైతం గెలిచి సిరీస్‌ను స్వీప్‌ చేయాలని టీమిండియా భావిస్తోంది.

అందుకే భావోద్వేగం చెందా:

అందుకే భావోద్వేగం చెందా:

తాజాగా అజింక్య రహానే మాట్లాడుతూ... 'పదో సెంచరీ ఎంతో ప్రత్యేకం. జట్టు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు ఆ సెంచరీ చేశా. ప్రత్యేకమైన సంబరాలు చేసుకోవాలని అనుకోలేదు. అలా జరిగిపోయింది అంతే. చాల కాలం తర్వాత సెంచరీ చేశా కాబట్టి కాస్త భావోద్వేగం చెందా. నేను గతంలో చెప్పినట్లుగా ప్రక్రియ ఎల్లప్పుడూ చాలా ముఖ్యమైనది. ప్రతి సిరీస్‌ ముందు సాధన, సన్నాహకం ముఖ్యం. రెండేళ్లుగా అదే చేస్తున్నా' అని రహానే తెలిపారు. తొలి టెస్టులో రహానే 81, 102తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

జట్టు కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నా:

జట్టు కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నా:

'తొలి టెస్ట్ తొలి రోజు వెస్టిండీస్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. నిజానికి మేం ఆ సమయంలో ఒత్తిడిలో ఉన్నాం. జట్టు కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడానికి ఇదే మంచి అవకాశం అని భావించా. ఆ పరిస్థితుల్లో నా గురించి ఆలోచించలేదు. ఒక మంచి భాగస్వామ్యం నెలకొల్పాలని నిర్ణయించుకున్నా. గడ్డు పరిస్థితుల్లో ఎవరో ఒకరు జట్టుకు అండగా నిలవాలి. ఆ రోజునా వంతు వచ్చింది. ఇక ఒత్తిడిలోంచి బయటపడ్డాం' అని రహానే పేర్కొన్నారు.

ఈ ఇన్నింగ్స్ ప్రత్యేకం:

ఈ ఇన్నింగ్స్ ప్రత్యేకం:

'వ్యక్తిగత మైలురాళ్ల కోసం నేను ఎప్పుడూ ఆలోచించను. జట్టు ప్రయోజనాలే ముఖ్యం. అయితే ఈ ఇన్నింగ్స్ వ్యక్తిగతంగా నాకు ప్రత్యేకం. రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు చేజార్చుకున్నా.. జట్టు ఆధిక్యంలో ఉంది. విరాట్‌తో భాగస్వామ్యం ఎంతో కీలకం. హనుమ విహారి బాగా ఆడాడు. కొన్నాళ్లుగా అతడు దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. అలాంటి వారు అంతర్జాతీయ మ్యాచులలో కచ్చితంగా రాణిస్తారు. ప్రత్యేకమైన ఆటగాడు రోహిత్‌ శర్మ జట్టులో లేకపోవడం కష్టంగానే ఉంది' అని రహానే చెప్పులోకొచ్చారు.

విండీస్‌తో రెండో టెస్టు: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. అశ్విన్‌కు చోటు కష్టమే

ప్రతీ మ్యాచ్‌ ముఖ్యమైనదే:

ప్రతీ మ్యాచ్‌ ముఖ్యమైనదే:

'వరల్డ్‌ టెస్టు చాంపియన్‌లో భాగం కావడంతో ప్రతీ మ్యాచ్‌ ముఖ్యమైనదే. తొలి టెస్టులో సాధించిన విజయంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. క్రికెట్‌లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఊహించలేము. విండీస్‌ను తేలిగ్గా తీసుకోవడం లేదు. విండీస్‌లో మంచి ఆటగాళ్లు ఉన్నారు. తొలి విజయాన్ని ఇక్కడ కూడా పునరావృతం చేయాలనుకుంటున్నాం' అని రహానే ధీమా వ్యక్తం చేశారు.

Story first published: Friday, August 30, 2019, 14:29 [IST]
Other articles published on Aug 30, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+